మరుసటి రోజు వంశీ ఆఫీస్ కి వెళ్ళాడు.కానీ వంశీకి ఆ రోజు ఆఫీసులో మనసు అసలు కుదురుగా లేదు. తన టీమ్ మెంబర్స్ ఏదో అడుగుతున్నా,
బాస్ ఏదో చెప్తున్నా అతని కళ్ల ముందు మాత్రం ఆ పాత డైరీ అక్షరాలే కదులుతున్నాయి. ఒక చిన్న పాప అంతటి నరకాన్ని ఎలా భరించింది అన్న ప్రశ్న అతన్ని వేధిస్తోంది.
సాయంత్రం ఆరు గంటల వరకు ఆగలేకపోయాడు. ఒక ఇంపార్టెంట్ పని ఉందని అబద్ధం చెప్పి, ఐదు గంటలకే ఆఫీస్ నుండి బయలుదేరాడు.
ఇంటికి రాగానే ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా తన రూమ్‌లోకి వెళ్లిపోయాడు.వంశీ.అప్పుడే వచ్చావేంటి నాన్న, కాఫీ తాగుతావా అని సరస్వతి గారు అడిగినా,
వద్దు అమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది, డిస్టర్బ్ చేయకండి అని చెప్పి గది తలుపు గట్టిగా వేసి గడియ పెట్టుకున్నాడు.
బ్యాగ్ నుండి ఆ డైరీని బయటకు తీశాడు. అతని చేతులు కొంచెం వణుకుతున్నాయి. ఆ డైరీని తాకుతుంటే ఆమె పడుతున్న బాధ తనను తాకుతున్నట్టు అనిపించింది.