New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 27

రాక్షసప్రేమ – 27

రాక్షస ప్రేమ -27

 

 

 

 

నీటకంగా నిదానంగా చుట్టూ చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్న శౌర్యని చూసిన పూజిత “ఒసేయ్ అక్క దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్లి పోయావే అసలే పెళ్లిలో అన్ని కరెక్ట్ గా ఉండాలి అని అన్నారు నువ్వు అక్క దగ్గర ఉంటే నేను మిగతా పనులు చూసుకుంటాను నువ్వే బయట తిరుగుతుంటే ఎలా..?” అని చిరుకోపంగా అన్నది పూజిత. 

 

“అబ్బా అమ్మ వస్తున్నాం లే అయినా అక్కని రెడీ చేయడానికి కష్టం ఎందుకు, ఎప్పుడు బంగారు బొమ్మలా ఉంది ఇంకా రెడీ చేసేస్తే మ్యూజియంలో పెట్టే బొమ్మలా తయారవుతుందేమో” అని అన్నది శౌర్య. 

 

“నీతో మాట్లాడటం మా వల్ల కాదే, నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు” అని చెప్పి పూజిత బయటకి వెళ్ళిపోయింది.

 

భరద్వాజ్ వచ్చే బంధువులందరినీ కూడా లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కార్తికేయ కూడా అలానే తమ తరఫు నుండి వచ్చే బంధువులందరినీ కూడా ఫంక్షన్ లోపలికి నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue