New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షస ప్రేమిక – 5

రాక్షస ప్రేమిక – 5

అగస్త్య నందు చెయ్యి వైపు చూసి…కాస్త స్వెల్ అయ్యినట్టు తెలుస్తుంటే…”గెట్ రెడీ… వి హేవ్ టు గో టు ది హాస్పిటల్!!”అని చెప్తాడు…

 

అలకనంద…మెల్లిగా ఎప్పుడూ ఇంగ్లీష్ యూస్ చేసేసరికి …”మీకు తెలుగు రాదా!?”అని అడుగుతుంది…

 

అగస్త్య ఒక చూపు అలకనంద నీ చూడడం తో….అక్కడి నుండి పరుగు పెడుతూ…మళ్ళీ గెస్ట్ రూమ్ కి వచ్చి తలుపు వేసుకుని…..

 

 

“చి నందు ఎందుకు అతనికి భయపడుతున్నావ్…నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు ధైర్యంగా ఫైట్ చేసి తప్పించుకోవాలి కానీ…ఇలా ఉంటే…ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటారు నీతో… ఇంతా సెన్సిటివ్ గా ఉంటే ఎలా నే!!”అని తల కొట్టుకునే లోపు…మళ్ళీ తలుపు చప్పుడు వినబడితే…

 

డోర్ ఓపెన్ చేసి “ఏంటి!?” అని అడుగుతుంది…

 

అగస్త్య….మాట్లాడుతూ…”లెఫ్ట్ హ్యాండ్ తడవకుండా ఫ్రెష్ అప్ అయ్యి రా!!”అని ఆర్డర్ వేస్తాడు….

 

 

అలకనంద అడ్డంగా నిలువుగా తల ఊపి…డోర్ వేసి…”కిడ్నాప్ చేసి మళ్ళీ కేర్ చూపిస్తాడు ఏంటి ఇంత మోనార్క్ మునగచెట్టు ఏంటో!!”అనుకుని 

 

జాగ్రత్తగా స్నానం చేసి…మళ్ళీ అదే డ్రెస్ వేసుకుని…బయటకి వచ్చేసరికి…..హాల్ లో ఎవరు లేకపోతే….సోఫా లో కూర్చుంటుంది…తనకి నిప్పుల మీద కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంటే…

 

 

చుట్టు చూస్తుంది…”ఒక మనిషికి ఇంతా సెక్యూరిటీనా…కొంపతీసి ఈయన ఏమైనా టెర్రిస్టా ఏంటి …!!?? శివయ్య ఏంటి నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసావ్!!…”అని అనుకుంటూ…దిక్కులు చూస్తున్న తనకి…మెట్లు దిగుతూ….బ్లాక్ సూట్ లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని…రాయల్ వాక్ చేస్తూ వస్తున్న అగస్త్య కనిపించగానే…తెలియకుండానే నుంచుంటే…

 

అగస్త్య సైడ్ స్మైల్ చేస్తూ… అలకనంద దెగ్గరకు వచ్చి…”కెన్ వి గో!!?”అని అంటాడు…

 

అలకనంద కి ఏం చెప్పాలో తెలియక..”ఉ..ఉహూ!!”అంటుంటే…అతడు ముందు నడిస్తే అతను వెనుక అనుసరిస్తుంది…కానీ ఆమె మనస్సులో మాత్రం కనీసం నాలుగు ముక్కలు కూడా తిన్నగా మాట్లాడని ఈ తిక్క మానవుడి తో వెళితే ఇప్పుడు ఏం అవుతుంది అబ్బ అని ఆలోచిస్తూ ఉంటుంది…

 

 

బయటకి వచ్చిన అగస్త్య…డ్రైవర్ ను వెళ్లిపోమని… కార్స్ ఉన్న సెల్లార్ కి వెళ్తాడు…అతడికి బెంజ్ కార్ నడపాలి అని అనిపించడం తో… వైట్ కలర్ బెంజ్ కార్ అన్లాక్ చేసి…కూలింగ్ గ్లాసెస్ తీసి…డ్రైవింగ్ సీటు లో కూర్చునేసరికి…”అసలు అతను ఎవరో తనని ఎందుకు హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నాడో… తనని ఎందుకు కిడ్నాప్ చేశాడో…!!”ఏమి అర్థం కాక బుర్ర పిచ్చి ఎక్కిపోతుంటే…ఇంకో వైపు డ్రైవర్ నీ వద్దు అని కూడా చెప్పడం ఇంకాస్త టెన్షన్ పెంచుకుంటుంది అలకనంద…

 

అదే టెన్షన్ తో ఆలోచిస్తూ కార్ ముందు దిష్టి బొమ్మల నుంచుంటుంది… అగస్త్య కార్ హార్న్ వేయగానే…తేరుకుని…కార్ బ్యాక్ సీటు డోర్ ఓపెన్ చేసుకుని లోపల కూర్చుని అలవాటులో పొరపాటుగా…డోర్ క్లోజ్ చేసేసరికి….

 

 

అగస్త్య ఫ్రంట్ మిర్రర్ నుండి బ్యాక్ కి చూస్తూ…”డు ఐ లుక్ లైక్ ఏ డ్రైవర్!?”అని అడుగుతాడు…

 

నందు కంగారుగా ఆ క్షణం తను చేసిన పనికి తనని తాను తిట్టుకుంటూ…కిందకి దిగి…ఫ్రంట్ సీట్ లో కూర్చుని డోర్ క్లోజ్ చేసి… సిట్ బెల్ట్ పెట్టుకుని…”సారీ!”చెప్తూ…”నన్ను ఎందుకు హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నారు అండి…ప్లీజ్ చెప్పండి…నా ఆర్గాన్స్ ఏమైనా తీసుకుని అమ్మేస్తారా!??”అని భయంగా అడుగుతుంది…

 

 

అగస్త్య కార్ స్టార్ట్ చేస్తూ….తన మాటలు వింటుంటే…నందు మళ్ళీ మాట్లాడుతూ…”ప్లీజ్ అండి…నేను చాలా చిన్న పిల్లని…నేను ఎప్పుడూ ఎవరికి అన్యాయం కూడా చెయ్యలేదు…మీర్ ఇలా చెయ్యడం చాలా తప్పు…!!”అని అంటూ ప్రాధేయ పడితే…

 

అగస్త్య స్టీరింగ్ తో టర్నింగ్ తిప్పుతూ…”ఆల్రెడీ యూ హేవ్ డిసైడెడ్ టు డై సో…వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనీ ఆర్గాన్స్ ఇఫ్ ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ యూర్ బాడీ!!”(అంటే చనిపోవడానికి సిద్ధ పడ్డ నువ్వు…నీ బాడీ లో ఆర్గాన్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి!!?”అని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు…

 

అతడు అడిగిన దానికి ఒక నిమిషం బుర్ర పని చెయ్యకపోతే…ఎలా అయిన అతనిని ఆపే ప్రయత్నం చెయ్యాలి అని నిర్ణయించుకుని గొంతు సరిజేసుకుని మాట్లాడటం మొదలు పెడుతుంది…

~~~~~~~~~~~

 

మరి నందు ఏం చెప్తోందో…..మొత్తానికి హీరో పేరు రివీల్ చేసేసాను..నచ్చిందా…అగస్త్య నందన్..❤️అలకనంద… డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇంకా ఎవరైనా ఫాలో చెయ్యకపోతే చేసేయండి..!!

 

మరి మీకు ఎపిసోడ్ నచ్చితే కామెంట్స్ మరియు రేటింగ్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ క్యూటిస్..!! 🤌🏻🤍