అలకనంద కి ఉన్న ఓపిక నశిస్తే..ప్రతి దానికి ఇలా మాట్లాడితే ఎలా అనుకుంటూ…”అట్లీస్ట్ నేను అన్న దానికి నన్ను క్షమించారా!?”అని అడుగుతుంది దీనంగా….
ఇంతలో అగస్త్య మాన్షన్ రావడం తో…కార్ నీ ఆపి…అలకనంద వైపు చూసి…”మీరు లోపలికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేయండి… అండ్ అలానే ఏదైనా అవసరం ఉంటే దిస్ ఇస్ మై విస్టింగ్ కార్డు అందులో నా నెంబర్ ఉంటుంది… ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అర్జెంట్గా ఆఫీస్ కి వెళ్ళాలి!!”అని చెప్పి విజిటింగ్ కార్డు అలకనంద చేతిలో పెట్టీ…అక్కడి నుండి వెళ్ళిపోతాడు…
నందు హుఫ్ అని అనుకుంటూ అక్కడ సోఫా లో దర్జాగా ఏదో తన ఇల్లు లా కూర్చుంటుంది…
~~~~~~~~~~~~~~~
గాయత్రి గారు కంగారుపడుతూ… “ఇప్పటికీ ఒకసారి కూడా నందు కాల్ చేయలేదు… అదే కాక తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడానికి కారణం ఏంటి… రేపు ఏదైనా అయితే ఆయనకి నేను సమాధానం చెప్పాలి!!”అని అటు ఇటు తిరుగుతూ కంగారుగా ఆలోచిస్తూ…. ఇంతలో ఒక ఐడియా రావడంతో నందు ఫ్రెండ్స్ కి కాల్ చేస్తారు…