New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 4

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 4

మేనేజర్ రూంకి ఇంటర్ వ్యూ కోసం వెళ్లిన జాను నీ లొంగదీసుకోడానికి ఒక వ్యక్తి ట్రై చేస్తూ ఉంటే….ఎవరో ఒక వ్యక్తి వచ్చి జాను మిద ఉన్న వాడిని బూటు కాలితో తాంతాడు..

ఆ ఫోర్స్ కి జాను మిద ఉన్న వాడు వెళ్లి అవతల పడి కోపంగా వాడిని తన్నిన వ్యక్తి నీ చూస్తూ షాక్ అయిపోయి భయంతో వణికిపోతూ ఉంటాడు.

అప్పటి వరకు జాను నీ బలవంతం చెయ్యబోయిన వాడి నుంచి తప్పించుకోడానికి ట్రై చేసినా జాను బాగ ఏడవడం వల్ల స్ట్రెస్ ఎక్కువ అయ్యి స్పృహ కోల్పోతుంది.

జాను నీ సేవ్ చేసిన వ్యక్తి కోపంగా కింద పడి అతన్నే భయంగా చూస్తున్న వాడి దగ్గరికి వెళ్లి , వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి చాచి చెంప మిద ఒక్కటి పీకి…

” సిగ్గు లేదా రా నికు…?  అసలు ఎన్ని సార్లు చెప్పాలి నీకు నా ఆఫీసు వైపు కూడా కన్నెత్తి చూడకు అని..నేను ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చిన కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా ఆఫీసు కి వస్తూ మా పరువూ తిస్తున్నావ్..!

ఇన్ని రోజులు మీ అమ్మ మొహం చూసి నిన్ను క్షమిస్తూ వచ్చాను కానీ , ఈ రోజు నువ్వు ఎంత ఘోరం అయిన పాపం చెయ్యబోయావ్ అంటే….

నీ చెల్లి అంత వయసు ఉన్న ఇంకో అమ్మాయి పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తూ…..ఇంత దుర్మార్గానికి పూనుకుంటావ్ అని అసలు నేను ఊహించలేదు…

నువ్వు చేసిన ఈ నీచం అయిన పనికి నిన్ను ఇక్కడికి ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టాలి అని ఉంది కానీ….

నీలాంటి వాడిని చంపిన పాపం నాకు అంటకూడదు అందుకే నిన్ను పోలీసులకి అప్పగించి జీవిత కాలం జైలు శిక్ష అనుభావించేలా చేస్తాను ” అని చెప్పి ఆయన ఫోన్ తీసుకొని పోలీసులికి ఫోన్ చేసి విషయం చెప్పి……

వాళ్ళని తర్వగా రమ్మని చెప్పి , కాల్ కట్ చేసి తన చేతుల్లో నుంచి తప్పించుకొని పారి పోవాలి అని ట్రై చేస్తున్న  వివేక్ నీ రెండు చేతులు వెనక్కి మడిచి అక్కడే కింద కూర్చోబెట్టి ….

ఎవరికో కాల్ చేశారు వివేక్ నాన్న ధనుంజయ్ గారు….

( అందరు తల్లి తండ్రులు తమ పిల్లలు ఎన్ని తప్పులు చేసిన సపోర్ట్ చేస్తూ ఉండరు..కొంత మంది ఇలా కన్న కొడుకు తప్పు చేసిన కూడా మందలించి బుద్ధి చెప్పే మంచి వాళ్ళు ఉంటారు )

ధనుంజయ్ కాల్ చేసినా ఒక ఐదు నిమిషాలకి కంగారుగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు ధనుంజయ్ పెద్ద కొడుకు విక్రమ్.

విక్రమ్ తో పాటు అతన్ని కలవడానికి వచ్చిన విజయ్ కూడా అతనితో పాటు  ఇంటర్ వ్యూ జరిగే రూం లోకి   వెళ్ళాడు.

ఆ రూం అంత కూడా చాలా గంభీరమైన వాతావరనాన్ని సంతరించుకుని ఉంది.

కుర్చీలో కూర్చొని ఉన్న ధనుంజయ్ గారి కాళ్ళ దగ్గర మొకాళ్ళ మిద కూర్చుని కోపం మరియు కోరిక తో స్పృహలో లేకపోవడం కింద పడిపోయి ఉన్న జాను నీ చూస్తుంటాడు వివేక్.

డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన విక్రమ్ కోపంగా చైర్ లో కూర్చొని ఉన్న ధనుంజయ్ గారిని , ఆయన కాళ్ళ కింద ఉన్న వివేక్ నీ చూసి …. అక్కడ ఏదో తేడాగా జరిగింది అని డౌట్ పడుతూ , ఆ రూం అంతా కలియ చూస్తాడు.

అలా చూస్తున్న విక్రమ్ కళ్ళు డోర్ కి మూలలో ఒక సైడ్ కింద పడి స్పృహ లేకుండా ఉన్న జాను మిద నిలిచిపోతాయి.

పరుగున జాను దగ్గరికి వెళ్లి మొకాళ్ళ మిద కూర్చుని తననే పరీక్షగా చూస్తూ ఉంటాడు.

వివేక్ కొట్టడం వాళ్ళ ఎర్రగా అతని చేతి వేళ్ళ అచ్చులు పడి కందిన రెండు బుగ్గలు , పెద్దవి చిట్లి లైట్ గా వస్తున్న రక్తం , పెనుగులాటలో అక్కడ అక్కడ చినిగిన డ్రెస్ , చెదిరిన జుట్టుతో ఎంతో అమాయకత్వంతో చూడగానే పాపం అనిపించేలా ఉంది మన జాను పాప.

విక్రమ్ కి జాను నీ అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది గుండెల్లో…

మరో పక్క జాను పరిస్థితి చూస్తూ అసలు అక్కడ ఏం జరిగి ఉంటుందో అంచనా వేస్తూ ఉంటాడు విజయ్.

అప్పుడే ఇంటర్ వ్యూ కోసం లోపలికి వెళ్లిన జాను ఇంకా బయటికి రాలేదు అని కంగారుగా ఆ రూం లోకి  దూసుకొని వెళ్ళింది మైధిలి.

అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ అయోమయంగా ఆ రూం అంతా కళ్ళతో వెతుకుతూ కింద పడిపోయి ఉన్న జాను నీ చూసి ఇంకా కంగారు ఎక్కువ అయిపోవడంతో తన దగ్గరికి వెళ్లి…

జాను….జాను…! ఏం అయ్యింది జాను..? ” అంటూ జాను పాప బుగ్గలు తడుతూ కంగారుగా తననే  పిలుస్తూ ఉంటుంది మైధిలి.

మైధిలి అలా జాను నీ పిలుస్తూ ఉండడంతో జాను పాపానే ట్రాన్స్ గా చూస్తున్న విక్రమ్ తేరుకొని దూరం జరిగి ….

నేను ఈ అమ్మాయి నీ హాస్పటల్ కి తీసుకొని వెళ్తాము డాడీ….మీరు మాత్రం వాడిని అసలు వదలకండి” అని కోపంగా వివేక్ నీ చూస్తూ పల్లు కొరుకుతూ చెప్పాడు విక్రమ్.

జాను పరిస్థితితి చూడగానే  ఏం జరిగి ఉంటుందో ఊహించాడు…అతనికి ఎలాగో తన తమ్ముడు వివేక్ గురించి బాగా తెలిసి ఉండడంతో అతనే జాను అలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం అని ఈజీ గా ఎస్టిమేట్ చేశాడు.

వివేక్ ఒక ప్లే బాయ్…అతనికి లేని బ్యాడ్ హాబిట్ అంటూ లేదు… మందు, సిగిరెట్ , డ్రగ్స్ , అమ్మాయిల పిచ్చి అన్నీ ఉన్నాయి… చాలా సార్లు ఇలానే అమ్మాయిల విషయంలో తప్పుగా బిహేవ్ చేసి చావు దెబ్బలు తిన్న కూడా అతని బుద్ధి మారలేదు.

వివేక్ లాంటి వాళ్ళని చూసే అంటారు ఏమో కుక్క తొక వంకర అని…

మైధిలి జాను నీ చూసి భయంతో ఏడుస్తూ ఉంటే అక్కడే ఉన్న విజయ్ తనని ఓదారుస్తూ … విక్రమ్ త్వరగా ఈ అమ్మాయి నీ హాస్పటల్ కి తీసుకొని వెల్దాం రా..! ” అని విక్రమ్ నీ పిలుస్తూ జాను నీ రెండు చేతులతో ఎత్తుకుంటాడు.

ధనుంజయ్ గారు వెళ్ళమని చెప్పడంతో వివేక్ నీ చంపేసేలా చూస్తూ విజయ్ దగ్గరికి వెళ్లి అతని చేతుల్లో ఉన్న జాను నీ విక్రమ్ చేతుల్లోకి తీసుకోవాలి అని ట్రై చేస్తాడు విక్రమ్ .

అప్పుడే అక్కడికి వచ్చిన రాఖి మధ్యలోకి వెళ్లి జాను నీ అతని చేతుల్లోకి తీసుకొని ముందుకి వెళ్ళిపోతాడు.

అమ్మాయిలు అంటే నచ్చని రాఖి అతని లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నీ అలా ఎత్తుకొని వెళ్ళడం చూసి షాక్ తో బిగుసుకొని పోయాడు విజయ్..

ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు..?

రాఖి ఎందుకు జాను నీ ఎత్తుకొని వెళ్ళాడు..?

ప్లీస్ షేర్ యువర్ ఒపీనియన్ అన్ థిస్ స్టోరీ
బంగారాలు…..

కామెంట్స్ ముఖ్యం బిగులూ🔥🔥

 

to be continued