వలయం -19
అప్పటికే రాజేష్ మాట్లాడలేక ఆయాసంతో చాలాసేపటి నుంచి పరిగెత్తాడో లేదంటే వాటర్ దప్పిక అవుతుంటే గొంతులో నుంచి మాట బయటకు రాలేదేమో కానీ వాటర్ కావాలి అన్నట్లుగా బొటనవేలుని వాళ్ళకి చూపించి వాటర్ కావాలి అని సైగల ద్వారానే అడిగాడు..
త్వరగా అతనికి వాటర్ ఇవ్వండి అని ప్రమోద్ చెప్పడంతో,
కానిస్టేబుల్స్ రాజేష్ కి వాటర్ ఇచ్చారు. సగం తాగి మిగిలిన సగంతో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అతను రాజేష్ అనే ప్రమోద్ గుర్తుపట్టి “రాజేష్ నువ్వేనా ఏమైంది అసలు ఏంటి ఇదంతా..?” అని కంగారుగా అడిగాడు.
“చెప్తాను అంత వివరంగా చెప్తాను” అని నిలబడలేక ప్రమోద్ భుజం మీద చేతులు వేసి అన్నాడు.
వెంటనే ప్రమోద్ పక్కన ఉన్న చైర్ తీసి రాజేష్ కి వేసి కూర్చో అని అతడిని కూర్చోబెట్టి “ఇప్పుడు చెప్పు ఏం జరిగింది? నీ మీద ఎవరు అటాచ్ చేసింది” అని సీరియస్గా అడిగాడు..