** అజేయ -113 **
అసలు అక్కడ ఏం జరుగుతోందిరా? నువ్వు సురక్షితంగానే ఉన్నావా?”
అది కాకుండా నీ గురించి ఏవేవో న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయ్.. అసలు ఏమ్ చేస్తున్నావ్.. రాఘవా నువ్వు అని అడుగుతారు కోపం గా..
ఆయన గొంతులో కోపం కన్నా ఎక్కువ గా ఆందోళన భయం నే రాఘవ్ కి స్పష్టంగా అర్ధం అవుతుంది..
రాఘవ్ సియా వైపు చూశాడు. సియా కూడా ఉత్కంఠగా ఫోన్ వైపు చూస్తోంది..
”డాడ్, ముందు మీరు ప్రశాంతంగా ఉండండి,” అని మెల్లగా అన్నాడు..రాఘవ్..