** అజేయ -114 **
“రాఘవ్…” సియా గాలి హోరును దాటుకుంటూ అతడి చెవిలో మెల్లగా అంది. “నీ ఒంట్లో ఆల్కెమీ స్వర్ణ ప్రవాహం ప్రవహించిన ప్రతిసారీ… నా వేలికి ఉన్న ఈ ఉంగరం కూడా కొట్టుకుంటోంది..
మన ఇద్దరి దేహాలు ఇప్పుడు ఒకే ప్రాణ శక్తితో కనెక్ట్ అయిపోయినట్లు అనిపిస్తోంది తెలుసా?” అని అనడం తో..
రాఘవ్ బైక్ మిర్రర్‌లో నుంచి సియా ముఖాన్ని చూశాడు. వెన్నెల వెలుగులో ఆమె కళ్లు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి..
“అది కేవలం ఆల్కెమీ శక్తి మాత్రమే కాదు సియా…” రాఘవ్ చిరునవ్వు నవ్వుతూ బైక్ స్పీడ్ కొద్దిగా తగ్గించి అన్నాడు..
“ఎనిమిది వందల ఏళ్ల క్రితం విడిపోయిన మన ఆత్మల మధ్య ఉన్న వైబ్రేషన్ అది. గుహలో ఆ ఖడ్గాన్ని నేను స్వీకరించినప్పుడు… అది కేవలం నాకు శక్తినే కాదు, గత జన్మలో నీపై నాకున్న అనురాగాన్ని కూడా వెయ్యి రెట్లు పెంచేసింది.”అని అనడం తో..