** అజేయ -115 **
మీ ఇద్దరి ఫ్యామిలీస్ వేరు.. కేవలం గత జన్మ బంధం మే మిమ్మల్ని ఒకటి చేసింది అనా..
లండన్‌లో స్థిరపడిన రామ్‌భూపాల్ రాయల్ ఫ్యామిలీ వేరు, ఢిల్లీలో ఉన్న మాధవ్ రాయల్ ఫ్యామిలీ వేరు అని!
రాఘవ్ లండన్ రీసెర్చర్ గా , నువ్వు ఢిల్లీ ఆర్టిస్ట్ అని మాత్రమే భావించారు.. అవునా?” అని అనడం తో..
రాఘవ్ నవ్వు దాస్తు.. గంభీరం గా మొహం పెట్టుకోగ.., సియా అవును అన్నట్టు గా తల ఊపారు..
”కానీ అది సగం మాత్రమే నిజం!” అంటూ.. రామ్‌భూపాల్ రాయల్ ముందుకు వచ్చి చెప్పారు..