** అజేయ – 71 **
కానీ రాఘవ్ సాధారణమైనవాడు కాడు. అతను కాలేజీ రోజుల్లోనే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ తీసుకున్నవాడు..
అతని ప్రాక్టికల్ మైండ్, అతని శరీరం రెండూ ఇప్పుడు అత్యంత వేగంగా స్పందించాయి..కేవలం అది మాత్రమే కాదు..
ఇప్పుడు అతని రక్తంలో ప్రవహిస్తున్న ఆనాటి పరాక్రమశాలి అయిన యువరాజు తాలూకు యుద్ధ నైపుణ్యం కూడా ఈ క్షణంలో అతని నరనరాల్లో ప్రవహించడం ప్రారంభించింది..
మొదటి గూండా తన కత్తితో రాఘవ్ తలని గురిపెట్టి గాల్లోకి లేపాడు.
కత్తి గాల్లో నుండి కిందకు దూసుకొచ్చే లోపే, రాఘవ్ అత్యంత వేగంగా పక్కకు తప్పుకున్నాడు..