** అజేయ – 72 **
కానీ ఆ పొద లోపల మాత్రం.. కాలం ఒక్కసారిగా స్తంభించిపోయినట్లు అనిపించింది..రాఘవ్, సియాలు ఒకరికొకరు ఎంత దగ్గరగా ఉన్నారంటే..
వాళ్లిద్దరి శ్వాసలు ఒకరి ముఖానికి మరొకరు తగులుతున్నాయి. పరుగు వల్ల, భయం వల్ల ఇద్దరి హృదయ స్పందనలు విపరీతంగా పెరిగాయి..
ఆ నిశ్శబ్దంలో వాళ్ల గుండె చప్పుళ్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి..
ఒక గూండా చేతిలోని కత్తిని పక్కనే ఉన్న రాయికి బాదుకుంటూ సరిగ్గా వాళ్లు దాక్కున్న పొదకు కేవలం ఐదడుగుల దూరంలోకి వచ్చాడు..