* * అజేయ – 75 * *
వాడి పేరే విక్రమ్!”విక్రమ్ అనే పేరు వినగానే సియా గుండె ఒక్కసారిగా లయ తప్పింది..
ఆ పేరు వినగానే ఆమె మైండ్లో మళ్లీ ఆ 12వ శతాబ్దపు శత్రు రాజ్యపు మహారాజు విక్రమాదిత్య చౌహన్ ముఖం మెరిసింది..
“విక్రమా? ఎవరు అతను ?” అని రాఘవ్ అడిగాడు..
“వాడొక ఇంటర్నేషనల్ యాంటిక్యూటీ స్మగ్లర్ (పురాతన వస్తువులను మరియు చారిత్రక విగ్రహాలను దొంగతనంగా విదేశాలకు తరలించే వ్యక్తి )”సార్,పైకి పెద్ద బిజినెస్ మాన్ కానీ లోపల ఒక క్రిమినల్ ” అని శంకర్ రహస్యంగా చెప్తాడు…
“ఈ అడవుల్లో ఉండే పురాతన విగ్రహాలు, శాసనాలు, విలువైన వస్తువులను దొంగిలించి విదేశాలకు అమ్మడం వాడి మెయిన్ బిజినెస్..