** అజేయ – 77 **
సీరియస్ గా వర్క్ లో మునిగిపోయిన రాఘవ్.. లీలాగా వినిపిస్తున్నా సౌండ్స్ కి..ల్యాప్‌టాప్ స్క్రీన్ నుండి కళ్లు తిప్పి సియా వైపు చూశాడు..
బ్రష్ కదులుతున్న శబ్దం ఆ నిశ్శబ్ద గదిలో స్పష్టంగా వినిపిస్తోంది..
రాఘవ్ ఆశ్చర్యం గా సియా నీ చూస్తూ.. లేచి నెమ్మదిగా ఆమె వెనుక వచ్చి నిలబడ్డాడు..
సియా చేతులు అత్యంత వేగంగా, ఒక అనుభవజ్ఞురాలి అయినా ప్రాచీన శిల్పి లాగా కదులుతున్నాయి..
మొదట సియా ముదురు ఆకుపచ్చ, నలుపు రంగులతో ఒక భారీ కొండల శ్రేణిని గీసింది. ఒకదాని వెనుక ఒకటి.. కరెక్ట్‌గా ఏడు కొండలు ఆ కాన్వాస్ పై రూపుదిద్దుకున్నాయి..