** అజేయ – 78 **
విక్రమ్ ఫోన్ కట్ చేసి, తన రూమ్ వున్నా కిటికీ గుండా బయట కనిపిస్తున్న చీకటిని చూస్తూ విక్రమ్ తన మనసులో అనుకున్నాడు..
“రాఘవ్.. మైథిలి.. మీరు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, ఈ జన్మలో కూడా ఆ ‘అజేయ ఖడ్గం’ నా చేతికే రాబోతోంది..
మీరు కష్టపడి ఆ ఏడు కొండల రహస్య లోయను వెతకండి.. దారి చూపించండి..
మీరు ఆ కత్తిని తాకిన మరుక్షణమే, శతాబ్దాల క్రితం ఆగిపోయిన మీ చావును నేను మళ్లీ పూర్తి చేస్తాను! అని అంటాడు..
విక్రమ్ తన ఎదురుగా వున్నా భైరవ్ మరియు లూయిస్ లా వైపు చూడగా.. ఇద్దరి కళ్ళలో కూడా ఏదో ఆశ వుంది..