** అజేయ – 79 **
అదిగో.. చూడు! ఆ ఏడో కొండ లోయలో అత్యంత వేగంగా దూకుతున్న ఆ వెండి-రక్త వర్ణపు ద్రవపాతం వెనుక.. ఒక రహస్య గుహ ఉంది! ఆ గుహ ద్వారమే ఇది!
శతాబ్దాలుగా ఆ ఉడుకుతున్న పాదరస తెరల వెనుకే అసలైన ‘అజేయ ఖడ్గం’ దాచబడింది..
అందుకే దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు!” అని అంటూ..రాఘవ్ ఉత్సాహంతో, తెలియని ఒక ఉద్వేగంతో సియా భుజాలనీ గట్టిగ పట్టుకున్నాడు..
సియా రాఘవ్ మాటలు వింటూ ఆ ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను, ఆపై తను వేసిన ఆ భయంకరమైన పెయింటింగ్‌ను మార్చి మార్చి చూసింది..
ఆమె మనసును అప్పటివరకు వణికించిన భయం… ఇప్పుడు క్రమంగా ఒక మహా బాధ్యతగా మారడం ప్రారంభించింది..