** అజేయ – 80 **
సియా ఆ పెయింటింగ్ బోర్డును, తమ బ్యాగులను వెనుక సీట్లో వేసి లోపల కూర్చుంది..
వెంటనే రాఘవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని క్లచ్ నొక్కాడు. జీపు పాతది కావడం వల్ల ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద శబ్దం వచ్చే ప్రమాదం ఉందని అతనికి తెలుసు..
ఒకవేళ విక్రమ్ మనుషులు ఆ శబ్దం వింటే ఇక్కడే వాళ్లని చుట్టుముడతారు, కానీ రాఘవ్‌కు వేరే ప్రత్యామ్నాయం లేదు…
అప్పటికి అప్పుడే రాఘవ్ ఆర్కియాలజికల్ మైండ్ ఇప్పుడు కేవలం మనుగడ గురించి మాత్రమే కాదు, భైరవ కోన చేరే మార్గం మాత్రమే గురించి ఆలోచిస్తోంది..
రాఘవ్ తన ఇష్టదైవాన్ని, తన అంతరంగంలోని ఆనాటి అజేయ యువరాజు శౌర్యాన్ని తలుచుకుంటూ ఒక్కసారిగా కీని తిప్పాడు..