** అజేయ – 81 **
జీపు రియర్-వ్యూ మిర్రర్‌లో ఒక భయంకరమైన మెరుపు కనిపించింది..దూరంగా కొండ కింద మలుపు నుండి..
విక్రమ్ ల్యాండ్ క్రూయిజర్ కార్ల హెడ్‌లైట్ల వెలుతురు మంచును చీల్చుకుంటూ అత్యంత వేగంగా పైకి దూసుకొస్తోంది! వాళ్లు భైరవ కోన సరిహద్దుల్లోకి ప్రవేశించారు..
వాళ్ళు చాలా దగ్గరకు వచ్చేశారు.. రాఘవ్ ఒక్కసారిగా గేర్ మార్చి, యాక్సిలరేటర్ పూర్తి బలంగా నోక్కాడు.
నల్లమల అడవుల తూర్పు సరిహద్దులు ముగిసి.. ‘భైరవ కోన’ లోని నిషేధిత సామ్రాజ్యం ప్రారంభమయ్యే కొద్దీ,
చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఒక భయంకరమైన శ్మశాన సదృశ్య నిశ్శబ్దంలోకి జారుకుంది..