New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 82
అజేయ Premium 6 min read

అజేయ – 82

           **   అజేయ  –   82 **

 

వాళ్ల బూట్ల చప్పుడు కూడా కొండల గోడలకు తగిలి ప్రతిధ్వనిస్తూ, భైరవ కోన లోపల ఉన్న రాఘవ్, సియాల చెవులకు చాలా స్పష్టంగా వినిపించసాగింది..

 

​ఆ అడుగుల చప్పుడు వినగానే రాఘవ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. దూరంగా ఆ చీకటి కొండల మలుపుల వెనుక నుండి విక్రమ్ గ్యాంగ్ తాలూకు టార్చ్‌లైట్ల వెలుతురు మంచును చీల్చుకుంటూ ఇటువైపే వస్తోంది..

 

​”రాఘవ్.. వాళ్లు వచ్చేసారు!” సియా భయంతో రాఘవ్‌ను గట్టిగా పట్టుకుంది..

 

​”సమయం లేదు సియా.. పరుగెత్తాలి!”అని అంటూ..రాఘవ్ ఆమె చేయిని మునుపెన్నడూ లేనంత గట్టిగా పట్టుకున్నాడు..

 

​ఆకాశంలో ఒక్కసారిగా ఒక పెద్ద ఉరుము ఉరిమింది. దట్టమైన వర్షం మళ్లీ ప్రారంభమైంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue