** అజేయ – 99 **
అతనీలో మాత్రం అజేయ ఖడ్గం శక్తులు దాగి ఉన్నాయనే నిజం ఆమెకు అర్థమైంది!
కార్ అడవి దారిలో మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తోంది.. అహోబిలం కొండల శిఖరాలు క్రమంగా దగ్గరవుతున్నాయి..
ముందు సీట్లో కూర్చున్న విక్రమ్… వెనక్కి తిరిగి రాఘవ్, సియాల వైపు చూశాడు..
అతడికి వాళ్లు మాట్లాడుకోవడం వినబడలేదు, కానీ రాఘవ్ ముఖంలో ఉన్న ఆ నిశ్చలమైన, ప్రశాంతమైన చూపులు అతడికి ఒక చిన్న అలజడిని కలిగించాయి..
“చూడు డ్యూడ్ !” అంటూ.. విక్రమ్ నవ్వుతూ