** అజేయ – 98 **
సియా కోసం ముందుకు వస్తున్న రాఘవ్ ని చూస్తున్న..విక్రమ్ తన గన్ నేరుగా రాఘవ్ గుండెలను లక్ష్యంగా చేసుకుని గురిపెట్టాడు..
కానీ ఈసారి అతడి చూపుల్లో కేవలం చంపాలన్న కసి మాత్రమే కాదు, ఆ అజేయ కత్తిని సొంతం చేసుకోవాలన్న పరమ లోభం స్పష్టంగా కనిపిస్తోంది…
**”నీ నీతి సూత్రాలు, నీ లండన్ లెక్కలు నా దగ్గర పనిచేయవు రాఘవ్! నువ్వు కత్తి ఉన్న చోటికి నన్ను తీసుకువెళ్లడం ఖాయం.. కానీ నీకు ప్రాణాలతో వుండే స్వేచ్ఛ ఇస్తానని నేను ఎక్కడా చెప్పలేదు కదా?”**
అని అంటూ..ఈవిల్ స్మైల్ చేసాడు విక్రమ్..
**”రేయ్! ఆ ప్రొఫెసర్ చేతులు కట్టేయండి! మన దగ్గర ఉన్న ఆ ప్రత్యేకమైన ‘కోరస్’ తీసుకొచ్చి వాడిని బంధించండి!
వాడు కదలకుండా, ఏ చిన్న మాయా ప్రయోగం చేయకుండా గట్టిగా కట్టేయండి!”** అని ఆర్డర్స్ వేయగా..