ప్రణవి ఆర్యన్ వైపు కోపంగా చూసి మేడ మీదకు వెళుతుంది…..
వెనకాలే అర్జున్ వెళ్తాడు….. ప్రణవి ఒక మూలకు వెళ్లి సైలెంట్ గా తల కిందకు దించి నిలబడి ఉంటుంది మీ పేరు ప్రణవి అంట కదా అంటూ దగ్గరికి వస్తాడు
ప్రణవికి కంగారుగా వెనక్కి జరుగుతుంది
కూల్ కూల్ మిస్ నేను మిమ్మల్ని ఏమి చేయడానికి రావడం లేదు మన పెళ్లి దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే ….
ప్రణవి అలాగే నిలబడి కిందకు చూస్తూ ఉంటుంది