“నన్ను మోటివేట్ చేయలేవు అని నేను ఎప్పుడు చెప్పాను నీకు.. నువ్వు నన్ను మోటివేట్ చేయకపోతే ఇంత ప్రశాంతంగా ఇంకో సంవత్సరంలో పుష్కరం పూర్తి అవుతున్న మన మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండేది కాదు.” అని అంది చిరునవ్వుతో శైలు.
“ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది మనల్ని ఊబిలోకి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు.. కానీ మనం దేనికి లొంగకుండా స్ట్రాంగ్ గా నిలబడగలిగితే ఊబిలో పడినా కూడా బయటకి రాగలం శైలు.
అంతేగాని వేరే వాళ్ళు ఊబిలోకి పడేస్తున్నారు అని తెలిసిన కూడా దాంట్లోకి వెళ్లి పడొద్దు.
చెట్టు మీద ఉన్న చిలుకని చూసి నేల మీద ఉన్న పాము బుసలు కొడుతుంది,ఆ బుసలకి భయపడి చిలుక ఆకాశంలోకి ఎగరకుండా పాము ముందుకు వెళ్లి నిలబడితే అది కాటు వేస్తుంది,కొంచెం ధైర్యం తెచ్చుకొని చిలుక ఆ చెట్టు మీద నుంచి గాలిలోకి ఎగిరి ఇంకో ప్రదేశానికి వెళ్తే దాని ప్రాణం నిలబడుతుంది.
ఇది నేను ఎందుకు చెప్తున్నాను నీకు అర్థం అవుతుంది అనే అనుకుంటున్నా.. మనల్ని ఊబిలోకి పడేయడానికి బయట నుంచి ఎవరో రారు మన చుట్టాలు మనతో దగ్గర బంధాలు ఉన్నవాళ్లే వస్తారు.