నాలో ఉన్న ప్రేమ❤️ – 1
Episode 1
అది ఒక మధ్యతరగతి వాళ్ళు ఉండే ఏరియా.
అందులో ఒక ఇంట్లో 21 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి హడావుడి గా హాలు లో తిరగుతూ అక్కడ ఉన్న వస్తువులను సర్దుతూ ఉంది.
తుడిచిన వస్తువులను మళ్లీ తుడుస్తూ, సర్దిన వస్తువులను మళ్లీ సర్దుతూ, ఒకసారి హాలు మొత్తం చూసి బాగా లేదు అని మళ్లీ వస్తువులను, వాటి స్థలాన్ని, మార్చుతూ.. సరిగా అందం గా కుదర లేదు అంటూ వాటి తో కుస్తీలు పడుతూ… ఉంది మన హీరోయిన్ నందన.
హాలు లో కూతురు పడుతున్న కుస్తీపాట్లు, వంట గది లో నుండి తొంగి చూసి ముసి ముసిగా నవ్వుతూ…
వంట చేస్తూ ఉంది, నందన వాళ్ళ అమ్మ రాజేశ్వరి గారు.
భుజం పై పసి పాప ని ఎత్తుకొని, పాప ని జో.. కొడుతూ… నందన ని చూసి నవ్వుతూ..
ఏంటి అమ్మ నీ కూతురు తెగ కుస్తీలు పడుతోంది, ఎవరి కోసం ఇంత ఆరాట పడుతూ… ఉంది,
రోజు కనీసం టీ.. తాగిన గ్లాస్ తీసి పక్కన పెట్టేది కాదు, అలాంటిది ఇవాళ ఉదయం నుండి ఇన్ని పనులు చేస్తూ.. హడావుడి చేస్తోంది ఎవరిని కాక పట్టాలి.. అని, హాల్ లో ఉన్న ఛైర్ లో కూర్చుని అంది నందన వాళ్ళ అక్క శ్వేత.
ఎవరి కోసం ఇంత ఆరాటం నువ్వే.. అడగవే నీ చెల్లి ని, మద్య లో.. నా.. రాయబారం ఎందుకు.. అంది, రాజేశ్వరి గారు, తన పని చేసుకుంటూ.
గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని, అందం గా సర్దిన హాలు ని మురిపెం గా.. చూసుకుంటున్న నందన, అక్క మాటలకి కళ్లు రెండు అక్క వైపు తిప్పి గుర్రుగా… చూసి, మళ్ళీ హాలు ని చూస్తూ మురిసి పోయింది నందన..
చిలకపచ్చ రంగు చీర కట్టుకుని, దానికి వర్క్ బ్లౌజ్ వేసుకుని, నుదుటన స్టోన్ బొట్టు పెట్టి, దాని కింద కుంకుమ బొట్టు పెట్టుకొని,
కళ్ల కు కాటుక పెట్టుకొని, ముక్కు కి తెల్లరాయి ముక్కు పుడక పెట్టుకొని, నల్లని బారు కురులను చక్కగా.. అల్లి జడ వేసుకొని, చిన్న రోజా పువ్వు పెట్టుకుని,
మెడ లో.. సన్నని ముత్యాల దండ వేసుకొని,
చేతి కి చిలకపచ్చ రంగు మట్టిగాజులు వేసుకొని, కాళ్ల కు సన్నని పట్టీలు పెట్టుకొని, సోఫా లో.. కూర్చుని గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని, గుమ్మం వైపు చూస్తూ కూర్చుంది నందన.
లక్ష్మి దేవిలా.. తయారు అయ్యి కూర్చున్న కూతురు ని, కళ్ల నిండు గా.. చూసుకుని సంతోషం గా..
రాజీ…. నేను మార్కెట్ వరకు వెళ్తున్నాను.. ఏదైనా కావాలా నీకు…. అంటూ పిలిచాడు నందన నాన్న గారు, కేశవరావు గారు.
వంట గది లో నుండి రాజేశ్వరి గారు, చేతులు పైటచెంగు తో.. తుడుచుకుంటు బయటకు వచ్చి
ఇప్పుడు మార్కెట్ వెళ్తా అంటున్నారు ఏంటి అండి….
మీ చెల్లెలు వచ్చే సమయానికి, మీరు ఇంట్లో లేకపోతే ఎలా…. అంటూ అడిగింది.
రాజీ.. నువ్వు కంగారు పడకు, లక్ష్మి రావటానికి.. ఇంకా సమయం ఉంది. బస్సు ఆలస్యం గా.. దొరికింది అంటా, నాకూ ఫోన్ చేసి చెప్పిందిలే…
తను వచ్చే లోపు నేను వెళ్ళి రావచ్చు అందుకే వెళ్తున్న… అంటూ చెప్పి,
చెవి దగ్గర గుసగుసగా.. ఈ పని ఆపి, ముందు నా కూతురు కి, దిష్టి తీయి.. అసలే మీకు కుళ్లు, మీ దిష్టి తగులుతుంది నా చిన్న కూతురు కి అంటూ… అన్నాడు.
ఆ మాట కు మూతి తిప్పి,
మీకే… ఉంది లెండి మహా… ముద్దుల కూతురు, తెగ మురిసి పోతున్నారు…
అయిన మావి ఎమ్ దిష్టి కళ్లు కావు… అంది రాజేశ్వరి గారు.
నవ్వుతూ.. వెళ్తున్న తన భర్త కేశవరావు గారి ని చూస్తూ…
కూతురు పైన తండ్రి కి ఉన్న ప్రేమ కి, మురిసిపోతు… ముద్దబంతి పువ్వులా.. మెరిసి పోతున్నా కూతురు ని చూస్తూ… దూరం నుండి చేతులతో.. చుట్టూ తిప్పి, మెటికలు విరిచింది… రాజేశ్వరి గారు.
శ్వేతూ… పాప ని ఇలా ఇవ్వు, ఉయ్యాల లో.. పడుకో పెడతా… అంటూ రూమ్ లో నుండి బయటకి వచ్చాడు, శ్వేత భర్త రోహిత్.
శ్వేత భుజాలపై ఉన్న పాప ని, తన భుజాల పైకి ఎత్తుకొని, వెనక్కి తిరిగిన రోహిత్ కి, గుమ్మం వైపు పదే పదే తొంగి చూస్తూ.. కూర్చున్న నందన కనిపించింది.
నందన ని అలా చూసి చిన్నగా.. నవ్వుకోని,
ఏంటి మరదలు పిల్ల…. ఇలా చూస్తూ ఉంటే తప్ప గుమ్మం దాకా వచ్చిన వాళ్లు లోపలికి రాను..
అని చెప్పార…. ఏంటి..
అలా తొంగి చూసి మెడలు పట్టేస్తే…. కష్టం చూడటానికి,
తరువాత ఎంత కట్నం ఇస్తామని… అన్న వంకర మెడ అమ్మాయి మాకు వద్దు… అంటారు, మగ పెళ్లి వాళ్ళు అప్పుడు మామగారు, నీ పెళ్లి కోసం, ఎన్ని ఊరులు తిరగాలో.. ఏంటో… అని నవ్వాడు… రోహిత్.
బావా…. అంటూ ఉక్రోషం గా.. అరిచి, అయిన మా ఆయన కి కట్నం ఎమ్ అవసరం లేదు, అడగడు కూడా…. నేను ఎలా ఉన్నా.. చేసుకుంటాడు, వంకలు ఎమ్ పెట్టడు… అని నేలచూపులు చూస్తూ.. చీర కొంగు ని వేళ్ల తో… సవరిస్తూ సిగ్గుపడుతూ…. చెప్పింది నందన.
ఆహా…. అవునా…. నాకు కాబోయే తమ్ముడు అంత మంచివాడ… చూపించు, చూస్తా కదా నేను కూడా… అంటూ పాప ని ఎత్తుకొని రూమ్ లోకి వెళ్లిపోయాడు… రోహిత్.
గుమ్మం నుండి చూపు మరల్చక కంటి రెప్ప వేస్తే.. ఎక్కడ చూసే అవకాశం చేయి జారీ పోతుందని కళ్ల ని గుమ్మం వైపు అప్పచెప్పి ఎదురు చూస్తూ… ఉండి పోయింది నందన.
మరి నందన ఎదురుచూపులు ఎవరి కోసమో….
అతని రాక తన జీవితం లో నవ్వులకు స్వాగతం చెప్తూ ఉందా…. లేక భాధ ని మిగుల్చుతుంద….. చూడాలి
Swipe left/right or tap the sides to turn pages