అనుకున్నట్టుగా సంయుక్త ఇంటర్వ్యూకి వేసుకెళ్దాం అనుకున్న డ్రెస్ ఉతికి పెట్టడంతో నెక్స్ట్ డే మార్నింగ్ సంయుక్త ఇంటర్వ్యూ కోసం నీటుగా రెడీ అయింది….
నువ్వు ఇంటర్వ్యూ వరకు సెలెక్ట్ అవ్వడమే గొప్ప విషయం…. ఆ తర్వాత రిజల్ట్ ఏదైనా సరే పెద్దగా ఫీల్ అవ్వకు అని సత్యవతి చెబుతుంటే ఏంటత్తా… ఏం జరిగినా మనసులో పెట్టుకోకు అని చెప్పాలి గాని నువ్వే దాని ఎబిలిటీ గురించి తక్కువ చేసి మాట్లాడితే ఎలా అంది….
మీ అత్తయ్యకి నా కూతురు ని తక్కువ చేసి మాట్లాడటం తప్పితే ఏం తెలుసమ్మ అని చంద్రం కాఫీ తాగుతూ చెప్పడంతో సత్యవతి మూతి తిప్పుకుంటూ వంట గదిలోకి వెళ్లిపోయింది….
అన్నయ్య నన్ను కొంచెం ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయవా అని అడగడంతో సరే డ్రాప్ చేస్తానని చెప్పడంతో ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేశాక తండ్రికి చెప్పి బయలుదేరి పోయారు….
ఆమె ఇంటర్వ్యూ కోసం వచ్చిన కంపెనీ వైపు చూస్తూ ఈ కంపెనీ మన అని అతను ఏదో చెప్పబోతూ ఉండగానే ఫోన్ కాల్ రావడంతో ఇంటర్వ్యూ అయిపోయాక ఒకసారి ఫోన్ చెయ్…. నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అని చెప్పి వంశీకృష్ణ వెళ్లిపోవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళింది….