ఎపిసోడ్ 11 అప్పుడె తలెత్తి చూసిన స్వప్నికకు ఆ నవ్వు కొంచెం కోపం తెప్పించింది. వెంటనే సర్దుకుని చెప్పమన్నట్టు చూసాడు విజె. స్వప్నిక మళ్ళీ ఆలోచనల్లో పడింది. అతను రాక ముందు నుంచి అందరూ విజె గురించి చెప్తున్న విషయాలు, తర్వాత ఈ రోజు అతను బ్రాండ్ అంబాసిడర్ గా రాధిక గురించి తీసుకునే నిర్ణయం ఆమెకి చాలా నచ్చాయి. ఒక్క వాళ్ళ మధ్య జరిగిన విషయం తప్పితె వీటి పరంగా చూస్తె ఎందుకో తన ఆలోచనలకి అతని ఆలోచనలు కొద్దిగా దగ్గరగా…