New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 12

పెళ్లి చూపులు – 12

పెళ్లి చూపులు -12

 

 

‘అమ్మని ఎంత ప్లాన్ చేసింది ఈ పిల్ల, పల్లెటూరి పిల్ల ఏమీ తెలియదు అనుకున్నాను. కానీ అమ్మో మామూలు అమ్మాయి కాదే నన్ను ఇరికించడానికి ఇంత ప్లాన్ చేసిందా..?’ అని మనసులో అనుకున్నాడు వైష్ణవ్..

 

“ఇప్పుడు నువ్వు ఈ అబ్బాయి తో వెళ్తే మీ అమ్మ సైలెంట్ గా ఉంటుందా..? నువ్వు ఈ అబ్బాయిని ఇరికించడానికి తీసుకొని వెళ్ళిన కచ్చితంగా నిన్నే తిడుతుంది. ఎందుకే ఈ గోల హ్యాపీగా వచ్చిన సంబంధం ఓకే అని పెళ్లి చేసుకోక” అని అన్నది ఆ బామ్మ..

 

“నాకు చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏం చేస్తాం ఈ అబ్బాయికి నేను నచ్చలేదంట అందుకే ఇలా ఇరికించడానికి ప్లాన్ చేశా” అని నవ్వుతూ కన్ను కొడుతూ అన్నది మహాలక్ష్మి.

 

‘అమ్మో పల్లెటూరు పిల్లా అని తక్కువ చేయడానికి అస్సలు లేదు, వీళ్ళకి ఉన్న కన్నింగ్ తెలివితేటలు ఎవ్వరికీ ఉండదు’ అని మనసులో అనుకున్నాడు వైష్ణవ్ బయటకు అనలేక ఏడవలేక 

 

“సరే సరే బామ్మ ఇప్పటికే లేట్ అయిపోయింది అక్కడ నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు బాయ్” అని చెప్పే సైకిల్ ఎక్కి “ఏంటి అబ్బాయి అలా చూస్తున్నావ్? పద పద త్వరగా పక్కూరి జాతరకు వెళ్లాలి” అని అన్నది మహాలక్ష్మి.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue