పెళ్లి చూపులు -13
వైష్ణవ్ కి ఫస్ట్ వాళ్ళ నెంబర్ 50 అని పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ ఏమీ అనలేక సైలెంట్ గా ఉన్నాడు.
ఏదైనా చెప్పాలి అంటే ముందు మహాలక్ష్మి చెప్పాలి కానీ మహాలక్ష్మి మాట వింటుందా అంటే డౌటే
తను మహాలక్ష్మిని కాదు అన్నాను అని ఆమె అలా పిలుస్తుందా అంటే లేదు తనకు ఇప్పటివరకు యాబై పెళ్లి చూపులు జరిగాయి అని ఇంతకుముందు బామ్మతో మాట్లాడినప్పుడే అర్థమైంది.
కానీ అలా నెంబర్ 50 అని పిలిపించుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆమె కాకుండా ఆమె ఫ్రెండ్స్ కూడా అలానే పిలవడంతో కొంచెం ఇరిటేటింగ్ ఫీలింగ్ కూడా తనలో కలిగింది. అదే విషయాన్ని ఆమెతో చెప్పాలి అనుకున్నాడు కానీ ఆమె తనకు అంత మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. గ్యాప్ కూడా లేదు అందుకే తన మాట్లాడలేక అసహనంగా ఫీల్ అయ్యాడు. అది కాకుండా ఇప్పుడు జాతర జరుగుతుంటే తన డబ్బుతో వాళ్లందరూ ఎంజాయ్ చేస్తాను అంటే మరింత అసహనంగా ఫీల్ అయ్యాడు.
ఎందుకంటే ఆడపిల్లలు బయటకు వస్తే ఏ విధంగా ఖర్చు పెడతారు అనేది తనకు బాగా తెలుసు అటువంటిది ఇప్పుడు ఇక్కడ ఐదుగురు ఉన్నారు. ఇక తన పర్సు కచ్చితంగా కాళీ అవుతుంది అని అనుకున్నాడు కానీ ఏం చేస్తాం వచ్చినందుకు తప్పదు అని నిట్టూర్చాడు.