పెళ్లి చూపులు -14
అది చూసిన వైష్ణవ్ కి ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. నిజానికి ఎవరైనా ఇలా మనీ ఇస్తుంటే వద్దు అని చెప్పారు కానీ ఇక్కడ బెలూన్స్ పేల్చాను అని మహాలక్ష్మి డబ్బులు ఇవ్వడం, ఆయన తన గిరాకీ ఎంతో అంతవరకే తీసుకోవడం, కాదు అని మిగిలిన మని ఇచ్చేయడం అంతా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
మరల ఆ మనీ పర్సులో పెట్టి వైష్ణవ్ చేతిలో పెట్టి ముందుకు నడిచింది మహాలక్ష్మి.
అదేంటి మహాలక్ష్మి నీకు అలా ఆ గన్ షూట్ చేయడం వచ్చా అని ఆశ్చర్యంగా అడిగారు మిగిలిన నలుగురు ఫ్రెండ్స్.
వచ్చు అని సింపుల్ గా చెప్పింది మహాలక్ష్మి.
“అదేంటి ఇంతకుముందు ఎప్పుడు జాతరకు వచ్చినా మనకు రాదు అని చెప్పే దానివి, మేమందరం గన్ షూట్స్ ట్రై చేసినా కూడా నువ్వెప్పుడూ ట్రై చేయలేదు ఎందుకు..?” అని ఆశ్చర్యంగా అడిగింది కల్పన