New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 3

పెళ్లి చూపులు – 3

పెళ్లి చూపులు -3

“ఇప్పుడు నువ్వు రెడీ అవ్వకపోతే అప్పుడు మీ నాన్న ఆనందానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది నువ్వే ఆలోచించుకో” అని ఎమోషనల్ గా  బ్లాక్మెయిల్ చేసి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది భారతి.
అప్పటివరకు ఎంతో ఆనందంతో బయటకి వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి జాతర ఎంజాయ్ చేయాలి అని అనుకున్నా సిరి ఒక్కసారిగా నీరసంతో బెడ్ మీద కూలబడింది.. 
ఈ అమ్మ ఎప్పుడు ఇంతే నా ఆనందానికి అడ్డుకట్ట వెయ్యాలి అనుకుంటుంది. హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్దాము అనుకుంటే పెళ్లి చూపులు అంటూ ఇంటిలో తతంగం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎలా ఈ పెళ్లి చూపుల నుంచి తప్పించుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. 
ఇక్కడ పెళ్లి చూపులు అయిపోయి నేను ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లేసరికి సాయంత్రం అవుతుంది అప్పటికి జాతర కూడా దాదాపు కంప్లీట్ అవుతుంది. ఇక నైట్ నన్ను నాన్న ఇంట్లో నుంచి బయటకు పంపించడు ఇక నేను జాతర మిస్ అయిపోయినట్లేనా అని బాధగా అనుకుంది.. 
కరెక్ట్ గా అప్పుడే తన ఫ్రెండ్ కల్పన నుండి ఫోన్ వచ్చింది..
వీళ్ళు ఒకళ్ళు గంట అవుతుంది కదా ఫోన్ చేయడం మొదలుపెట్టారు వస్తున్నావా రావటం లేదా అని వీళ్ళు నాకోసం ఫోన్ చేస్తున్నారా లేకపోతే నేను వాళ్ల కోసం పెట్టే ఖర్చు కోసం ఫోన్ చేస్తున్నారా అని అడకత్తరలో పోకు చెక్కల మారిన తన పరిస్థితికి తానే జాలిపడి ఇక తప్పక లాస్ట్ రింగుకి ఫోన్ లిఫ్ట్ చేసింది.
ఇటువైపు నుండి సిరి హలో అని అనకముందే అటువైపు నుండి “ఏంటే ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు, ఇంతకీ రెడీ అయ్యావా లేదా..? బయలుదేరావా లేదా..? నీకోసం ఇక్కడ మేము అందరం వెయిట్ చేస్తున్నాం.. నువ్వొస్తే సరదాగా జైంట్ వీల్ తిరగాలి అలానే గాజులు కొనుక్కోవాలి, పీచు మిఠాయి తినాలి. ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి” అంటూ వరస పెట్టి చెప్పటం మొదలు పెట్టింది.
ఇది ఒకటి కనీసం ఇక్కడ ఉన్న సిచువేషన్ చెప్పను కూడా చెప్పనీయ్యదు, దీని బాధ దీనిది ఏం చేస్తాంలే అని అనుకుంటూ “నేను రావటం లేదు” అని నీరసంగా అన్నది.
అదేంటి అది ఒక్కసారిగా గట్టిగా అరిచింది కల్పన. 
ఇక్కడ సిరి ఉలిక్కిపడి చేతిలో ఉన్న ఫోన్ ని పైకి ఎగరేసింది అది నేలను ముద్దాడుతుంది అన్న ఆఖరి క్షణంలో ఫోన్ ని పట్టుకొని ఇది ఏంటి ఇలా అరిసింది నేను ఉండాలా పోవాలా అని విసుక్కొని “నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఇంటిలో, ఏం చేయాలో తెలియడం లేదు నాకు జాతరకు రావాలి అని ఉంది కానీ అమ్మ కాళ్ళు విరగగొడతాను అని చెప్పేసింది”  అని నీరసంగా చెప్పింది..
పెళ్లిచూపులు అన్నమాట వినడంతోనే అటువైపు కల్పన ఆమె ఫ్రెండ్స్ గొల్లున నవ్వారు.
బుంగమూతి పెట్టుకుని ఏంటి నవ్వుతారు అని అన్నది సిరి.
“కుదిరేనా సచ్చేనా, ఆ పెళ్లిచూపులు ఎందుకు ఏదో మీ నాన్న నిన్ను ఇంటిలో నుంచి బయటకు గెంటయ్యటానికి తాపత్రయపడతాడు కానీ నువ్వు మాత్రం ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతావా..? ఆ ఇంటిలో ఉన్న దూలం ఎలాగో నువ్వు కూడా అలానే వేలాడుతావు. ఇంకెందుకే నీకు పెళ్లి చూపులు మూసుకొని జాతరకు వచ్చేయ్ ఏదో ఒకటి చెప్పేసి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం” అని సిరి మాట కూడా పట్టించుకోకుండా ఫోన్ పెట్టేసింది కల్పన. 
కరెక్ట్ గా అప్పుడే ఆ ఊరిలోనికి ఎంటర్ అయింది ఒక పెద్ద కార్ 
మన ఊరిలోనికి ఎవరు కారులో వస్తున్నారు అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా నోరులు పెద్దవి చేసి చూసారు. 
రోడ్లన్నీ గతుకులు గతుకులుగా గుంటలు గుంటలుగా ఉండటంతో కార్లో ఉన్న వాళ్ళని ఉయ్యాల ఊపేస్తుంది..
“అబ్బా నాన్న ఎక్కడికి వచ్చాం మనం” అని చుట్టూ చూస్తూ పక్కా పల్లెటూరుగా కనిపిస్తూ ఉన్న ఆ ఊరిని గమనించి “ఇటువంటి పక్కా పల్లెటూరికి మనం పెళ్లి చూపులకు రావాలా, అసలు నేనేంటి నా స్టేటస్ ఏంటి నేను చదివిన చదివేంటి ఇటువంటి ఏరియాలో ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా..?” అని అసహనంగా అన్నాడు పెళ్లిచూపులుకి వస్తున్న వైష్ణవ్…
“రేయ్ ఊరిని చూసి ఆడపిల్లని అంచనా వేయకూడదు రా..?” అని అన్నారు వైష్ణవి తండ్రి విజయేంద్ర…
“ఏమోనండి ఇంతటి పక్కా పల్లెటూరులో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు కూడా అంతగా నచ్చటం లేదు,  మీరు రమ్మన్నారు కాబట్టి వస్తున్నాను” 
అని అన్నది వైష్ణవ్ తల్లి వరూధిని. 
“అబ్బా మనం వెళుతుంది పెళ్లిచూపులుకే అక్కడికి వెళ్లాలి అమ్మాయి మనకు నచ్చాలి మన అబ్బాయి వాళ్లకి నచ్చాలి చాలా తతంగం ఉంది ఎందుకు అప్పుడే తొందర పడతారు” అని విసుక్కున్నారు  విజయేంద్ర.
“మన అబ్బాయిని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా వాళ్లే మన కోసం పది తరాలు ఎదురుచూస్తూ ఉండాలి మన అబ్బాయి కోసం” అని అన్నది వరూధిని తన కొడుకుని గొప్పగా చెబుతూ. 
ఆ మాటలు వింటూ తన తల్లి వైపు ప్రేమగా చూసాడు వైష్ణవ్.
“ఏమో నాన్న నీ బలవంతం మీద వస్తున్నాను కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ ఏమాత్రం లేదు” అని అంటూ బయటికి చూస్తూ కూర్చున్నాడు వైష్ణవ్. 
ఇంకా ఉంది.
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.
ఇంతకీ వీళ్ళకి పెళ్లిచూపులు జరుగుతాయా లేదా