పెళ్లి చూపులు – 4
పెళ్లి చూపులు -4
“ఏమో నాన్న నీ బలవంతం మీద వస్తున్నాను, కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ ఏమాత్రం లేదు” అని అంటూ బయటికి చూస్తూ కూర్చున్నాడు వైష్ణవ్..
అమ్మాయి గురించి తెలియక వీళ్లిద్దరూ ఇలా మాట్లాడుతున్నారు లే, అమ్మాయిని చూశారు అంటే వీళ్ళిద్దరూ కచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటారు. ఇక కొన్ని రోజుల్లోనే పెళ్లి జరిగిపోతుంది నేను అనుకున్నట్లుగానే ఆ అమ్మాయి నా ఇంటికి కోడలు అవుతుంది అని మనసులో అనుకున్నారు విజయేంద్ర..
భార్గవ్ గారి ఇల్లు ఎక్కడ అని అక్కడ ఇద్దరు ముగ్గురిని అడిగి భార్గవ్ గారి ఇంటికి చేరుకున్నారు.
ఊరు చూస్తుంటేనే అలా ఉంది ఇక ఇల్లు ఎలా ఉంటుందో అని అనుకున్నా వరూధిని ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది..
పల్లెటూరు అయినా సరే సిటీకి ఏమాత్రం తగ్గని విధంగా చాలా మోడరన్ గా కనిపించింది. ఇంటి ముందు ఉన్న పూల తోట పల్లెటూరిగా తలపిస్తే ఇల్లు మాత్రం సిటీలానే అనిపించింది..
ఆమెకు అలా అనిపించటానికి కూడా కారణం లేకపోలేదు ఊరిలో ఉన్న ఇల్లు అన్నీ కూడా దాదాపు నార్మల్గా పెంకుటిల్లు లేదంటే చిన్నచిన్న ఇల్లులు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు అమ్మాయిని చూడటానికి వచ్చిన ఇల్లు రెండు ఫ్లోర్లతో చాలా కొత్తగా అందంగా కనిపించింది.
భాహుషా కొత్తగా కట్టి ఉంటారు ఏమోలే అని మనసులో అనుకుంది వరూధిని..
వైష్ణవ్ కి అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు అతనికి ఇప్పుడు పెళ్లిచూపులుకి రావటమే ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఇంకా తన మైండ్లో రాలేదు. తన మనసు దానికి సిద్ధంగా లేదు. ఏదో తన తండ్రి బలవంతం చేయడంతో కాదు అనలేక వచ్చాడు..
కారు వచ్చింది అని ఇంటిలో ఉన్న భార్గవ్ భారతి ఇద్దరికీ సౌండ్ రావడంతో వెంటనే పరుగున బయటకు వచ్చి విజయేంద్ర వాళ్లకు ఎదురు వచ్చారు.
రండి రండి అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తూనే ఒకపక్కగా ఉన్న వాటర్ కాళ్లు కడుక్కోమని చూయించింది భారతి..
కాళ్లు కడుక్కొని ఇంటిలోనికి వెళ్లే పద్ధతి వాళ్లకు లేకపోవడంతో ఫస్ట్ కొంచెం వింతగా ఆ తర్వాత పాత పద్ధతి అనుకుంటూ ముగ్గురు కాలు కడుక్కొని లోపలికి వచ్చారు..
వరూధిని మాత్రం చుట్టూ ఉన్న మినీ గార్డెన్ ని చూస్తుంది సిటీలో అయితే అలానే అంటారు కదా కానీ పల్లెటూరులో ఏమంటారు అని అనుకుంటూ తనకు ఆ మినీ గార్డెన్ నచ్చటంతో తన కళ్ళు అక్కడే నిలిచిపోయాయి…
విజయేంద్ర గారు భార్గవ్ భారతి ఇద్దరితో నార్మల్ గా మాట్లాడుతూ ముందుకు వచ్చారు.
కూర్చుండి అన్నయ్యగారు అంటూ భారతి సోఫాలు చూయించింది.
కనీసం కూర్చోడానికి చైర్స్ అన్న ఉంటాయా అని అనుకుంది ఆ పల్లెటూరులోనికి ఎంటర్ అయిన తర్వాత వరూధిని తను అమ్మాయిని చూడటానికి వెళుతున్న ఇంటిలో కానీ అక్కడ సోఫా చూడటం లోపల ఇంటీరియర్ కూడా చాలా అట్రాక్షన్ గా అనిపించడంతో కళ్ళు జిగేలుమనిపించాయి ఆమెకు.
ఆ పల్లెటూరు బైతు నాకు కోడలు కావటం ఏంటి అని అనుకుంది ఫస్ట్ లో కానీ ఇప్పుడు ఆ ఇంటిని చూస్తుంటే తనకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది..
ఐ థింక్ ఈ పల్లెటూరులోని వీళ్ళే బాగా డబ్బున్న వాళ్ళు అయ్యి ఉంటారులే అని మనసులో అనుకుంది.
విజయేంద్ర నవ్వుతూ సోఫాలో కూర్చుంటే వరూధిని ఇల్లు మొత్తం తన కళ్ళతోనే స్కానింగ్ చేస్తూ కూర్చుంది. ఇక వైష్ణవ్ అసహనంగా ఏంటో నాకు ఈ కర్మ అన్నట్లుగా కూర్చున్నాడు సోఫాలో…
ముగ్గురు ఒకే సోఫాలో కూర్చోవడంతో వాళ్లకి ఎదురుగా ఉన్న సోఫాలో భార్గవ్ గారు కూర్చున్నారు.
భారతి వంటగదిలోనికి వెళ్లి వాటర్ తీసుకొని వచ్చి ఇచ్చింది..
“గతికితే అతకదు అంటారు ఇప్పుడు ఏమి వద్దమ్మా” అని సున్నితంగా చెప్పేసారు విజయేంద్ర.
ఆమె కూడా ఎక్కువ పోర్స్ చేయకుండా సరే అంటూ వెనక్కి వచ్చేసింది..
అలా అయిదు నిమిషాలు మాట్లాడిన తర్వాత విజయేంద్ర గారు భార్గవ్ గారి వైపు అంతే తీక్షంగా చూసారు.
“ఏంటండీ అలా చూస్తున్నారు..?” అనే భార్గవ్ గారు అడిగితే,
” నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను” అని అంటూనే “మీ పేరు భార్గవ్ కదా..” అని అడిగారు..
అవును అని చాలా సింపుల్ గా అన్నారు భార్గవ్..
ఆ మరుక్షణమే విజయేంద్ర గారికి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా “ఒరేయ్ భార్గవ్ నువ్వా..?” అని గట్టిగా అరిచారు.
ఆయన అలా అరవటంతో భార్గవ్ గారికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది భారతి గారికి అయితే ఈయన ఏంటి ఇలా పిలుస్తున్నారు వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా కానీ ఈయన నాకు ఏమీ చెప్పలేదే అని అనుకుంది..
ఇక వరూధిని అయితే ఎక్కడికి వెళ్ళినా ఈయనకు తెలిసిన వాళ్ళు ఉండనే ఉంటారు అని అనుకుంది. త్వరగా ఈ పెళ్లిచూపులు కార్యక్రమం ఏదో అయిపోతే అక్కడ నుంచి బయటపడాలి అని ఆలోచనలో ఉన్న ఆమె.
మీరు ఎవరో నాకు గుర్తుకు రావటం లేదు అని చిన్నగా అన్నాడు భార్గవ్. అమ్మాయిని చూడటానికి వచ్చిన వాళ్ళతో మర్యాద తప్పి మాట్లాడితే బాగోదు అన్న ఉద్దేశంతో
“రేయ్ ఇంకా నన్ను గుర్తు పట్టలేదా ఇంటర్మీడియట్ మనిద్దరం కలిసి చదువుకున్నాం. ఫస్ట్ నిన్ను చూసి గుర్తుపట్టలేదు ఇదిగో నిదానంగా చూస్తే గుర్తుపట్టాను. ఇంక నువ్వు నన్ను గుర్తు పట్టలేదా నేను విజయ్ ని లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాను” అని అనటంతో అప్పుడు భార్గవ్ గారి గుర్తుతెచ్చుకొని “హో విజయ్ నువ్వా..?” అని అన్నారు.
అబ్బా ఏంటో ఈ పాత పరిచయాలు, స్నేహం అంటే ఇదేరా అనే టైటిల్ పెట్టాలేమో వీళ్ళిద్దరి కోసం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు అని అసహనంగా అనుకున్నాడు వైష్ణవ్ ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఫీల్ అవుతూ,,
ఇంకా ఉంది.
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.
Swipe left/right or tap the sides to turn pages