ప్రేమలో పడితే -10
“అసలు నీకు బ్రెయిన్ ఏ లేదు. ఇక కన్ఫ్యుస్ చేయడం కూడానా ఫస్ట్ ఏం కావాలో చెప్పు. అది ఆర్డర్ ఇద్దాం అందులో కూడా కన్ఫ్యూజ్ అయితే నీ పొట్టలోకి వెళ్లే ఐటమ్స్ కన్ఫ్యూజ్ అయిపోతాయి” అని నవ్వుతూ అన్నది మహాలక్ష్మి.
“తిండి విషయంలో నేను ఎప్పుడు క్లారిటీగా ఉంటాను.” అని నవ్వుతూ,
తనకి ఏం కావాలో చెప్పాడు, రమ్య ని అడిగితే నాకు పెద్దగా తినాలి అని లేదు ఒక టీ చాలు అని చెప్పటంతో, నేను పార్టీ ఇస్తుంటే టీ చాలా అంటావేంటి అని రమ్యకి కావాల్సింది కూడా మహాలక్ష్మి ఆర్డర్ ఇచ్చింది. అలా ముగ్గురు కూడా హ్యాపీగా తిని వాళ్ళ ప్లేస్ లో వచ్చి కూర్చున్నారు.
ఇదంతా కూడా శ్రీరామ్ తన సిసి లో వాళ్ళు చేసే పనిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు, కానీ వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ హ్యాపీనెస్ ని పాడు చేయలేదు
రమ్య చాలా హ్యాపీగా ఇంటికి వచ్చింది కానీ తన హ్యాపీనెస్ పాడు చేయడానికి అన్నట్లుగా ఇంట్లో తన తాతయ్య నరసింహమూర్తి ఉన్నాడు కదా