ప్రేమించావే చెలి 🌹🌹 – 1
ప్రేమించవే చెలీ🌹🌹
ఎపిసోడ్ 1:……..
ఒక బంగ్లా లో ఒక అందమైన అమ్మాయి తన గది లో అద్దం ముందు కూర్చుని వుంది…….
తనని ఇద్దరు బ్యూటీషన్లు రెడీ చేస్తుంటే అయిష్టం గానే అక్కడ కుర్చుని వుంది……
అప్పుడే లోపలికి తన తల్లి వచ్చి …… అమ్మ మేఘ ఇంకా రెడీ అవ్వలేదా పంతులు నిన్ను తీసుకు రమ్మంటున్నారు…… అని అంటారు………
అది విన్న మేఘ కోపం గా ఏంటిది అమ్మ ఇదంతా నాకు పెల్లేంటి……. అది నాకు ఒక్క మాట కూడా చెప్ప కుండా ఆఖరి నిమషం లో నాన్న నన్ను ఇక్కడికి తీసుకు వచ్చి గంటలో పెళ్లి అనడం ఎంటి అమ్మ……
నా ఇష్టాల తో పని లేదా మీకు…….. అని ఏడుస్తూ అడుగు తుంది……… అది విన్న రాధిక గారు అది కాదు తల్లి నాకు ఆకరి నిమషం లో తెలిసింది నీకు పెళ్లి అని…….. అయినా మీ నాన్న గారు ఎది చేసిన అది నీ మంచి కోసమే కదా……. అని నచ్చ చెప్ప డానికి ట్రై చేస్తారు……..
కానీ మేఘ కోపం గా నా మంచి ఎంటి అమ్మ చిన్నప్పటి నుండి నాకు నచ్చింది ఒక్కటి కూడా నా లైఫ్ లో జరగ లేదు……..
ఇప్పుడు ఎవరో ముక్కు మొఖం తెలియని వ్యక్తి కి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అని అంటూ వుండ గానే…………
లోపలికి తన తండ్రి శేష చలం గారు వచ్చి రాధిక…. మేఘ రెడీ అయ్యిందా……. అని అడుగుతూ తన కూతురు కళ్ళలో నీల్లు చూసి మేఘ ఏమయ్యింది ఎందుకు ఏడుస్తున్నావు?????? అని అడుగు తారు……
దానికి మేఘ ఏడుస్తూనే నాకు పెళ్ళి ఇష్టం లేదు నాన్న…… అని తల దించు కుని చెప్తుంది…..
అది విన్న ఆయన చూడు మేఘ ….. నువ్వు కచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే…… నేను వాళ్లకి మాట ఇచ్చాను…. నువ్వే వాళ్ళింటి కొడలివి అవుతావు అని …. ఇంకా ఎమ్ మాట్లాడ కుండా పెళ్లి చేసుకో అని చెప్తాడు……
అది విన్న మేఘ ప్లీజ్ నాన్న నేను ఇప్పుడే కదా జాబ్ చేస్తున్న……. నాకు పెళ్ళి వద్దు నాన్న అని ఆకరి ప్రయత్నం గా అడుగు తుంది……
అది విన్న ఆయన నువ్వు పెళ్లి చేసుకున్న తర్వత కూడా జాబ్ చేయచ్చు ……… దానికి నీ భర్త ఏమి అడ్డు చెప్పడు అని చెప్పి….. రాధిక త్వరగా తీసుకు రా…. అని చెప్పి బయట కి వెళ్ళిపోతారు…..
అది విన్న మేఘ చేసేదేం లేక అలాగే వుండి పోతుంది…….
రాధిక గారు కూడా ఎమ్ చేయలేక అబ్బాయి చాలా మంచి వాడు రా… నిన్ను బాగా చూసుకుంటాడు….అని చెప్తుంది…….
కానీ మేఘ మాత్రం అలాగే సైలంట్ గా వుండడం తో రాధిక గరే మేఘ నీ రెడీ చేసి మొకం మిద మేలి ముసుగు వేసి బయట కి తీసుకు వస్తారు……
అప్పటికే ఆ ఇంట్లో ఒక వైపు స్టేజ్ మిద ఒక అందమైన అబ్బాయి పంతులు గారు చెప్తున్నట్టు గా పూజ చేస్తున్నాడు…….
కానీ మేఘ మాత్రం కనీసం తల కూడా పైకి ఎత్తి చూడ కుండ అలాగే ఆ అబ్బాయి పక్కన కుర్చుని ఎదో యాంత్రికంగా పంతులు చెప్తున్నట్టు చేస్తుంది………..
ఆ అబ్బాయి కూడా మేఘ వైపు ఒక సారి మళ్ళీ తన తల తిప్పేసుకున్టాడు…….
కాసేపటికి పంతులు అమ్మాయి మీడ లో తాళి కట్టమంటే ఆ అబ్బాయి పైకి లేచి మెడలో తాలి కడతాడు………
కానీ మేఘ మాత్రం అక్కడితో తన జీవితం ముగిసి పోయినట్టు తన కళ్ళల్లో వస్తున్న నీళ్లని ఆపుకుంటూ వుంటుంది……
కానీ కొన్ని కన్నీటి బొట్లు ఆ అబ్బాయి కాలి మిద పడడం తో ఆ అబ్బాయి తల ఎత్తి మేఘ వైపు చూస్తాడు……..
కానీ మేలి ముసుగు వుండడం తో మేఘ ఫేస్ కనపడదు…………
ఆ కాసేపటికి పెళ్లి తంతులు అన్ని పూర్తి కావడం తో అమ్మాయిని అత్తింటికి సాగనంపేందుకు అందరూ బయట కి వస్తారు…….
శేషా చలం గారు రాధిక గారూ మేఘ చేతిని తీసుకుని ఆ అబ్బాయి చేతిలో పెట్టీ సాత్విక్ ఇకపై నా కూతురు బాధ్యత మీది అని చెప్తాడు…….
రాధిక గారు మేఘ నుదిటి మీద ముద్దు పెట్టి మేము రేపు వస్తాం తల్లి నువ్వు జాగ్రత అని చెప్తారు……
కానీ మేఘ ఎమ్ మాట్లాడ కుండా అలాగే సైలెంట్ హా వుంటుంది… కానీ తన చెయ్యి సాత్విక్ చేతిలో వుండడం చూసి తన చేతిని తీసుకో బోతుంది…… కానీ సాత్విక్ తన చేతిని గట్టిగా పట్టుకుని వుండడం చూసి చాల చిరాకు గా అనిపిస్తుంది ………. ..
To be continued………
టాగ్ యువర్ కామెంట్స్ బంగారాలు 🥰❤️… కామెంట్స్ కొంచం త్వరగా ఇవ్వండి బంగారాలు
Swipe left/right or tap the sides to turn pages