ఎనిమిది నిమిషాల తర్వాత వీడియో చూడలేక కళ్ళు మూసుకొని..”ప్లీజ్ స్టాప్ ఇట్..” అని అన్నాడు అరుస్తూ అర్జున్.
“నీ ఫ్రెండ్ ని నువ్వే అలా చూడలేకపోతే..! అతనిని ప్రేమించి,ఆయనకి అన్ని అర్పించి.. ఇంకొక ఆడదానితో అతనిని నేను అలా ఎలా చూడగలిగాను అన్నయ్య.
అలాంటి వ్యక్తితో జీవితాన్ని ఎలా పంచుకోగలను..?” అని అంది ఏడుస్తూ జాను.
వీడియో ఆఫ్ చేసి ఫోన్ పక్కన పెట్టిన జాను వైపు చూస్తూ..”దిని గురించి వాడితో మాట్లాడావా..?” అని అడిగాడు అర్జున్.
“ఇది చూసి ఇంటికి వచ్చాకనే నాకు ఫీడ్స్ వచ్చి పడిపోతే నాన్న హాస్పిటల్ కి తీసుకువచ్చాడు.