బ్లడీ ఇష్క్ – 5
” ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నీ కూతురు తొందర్లో ప్రెగ్నెంట్ అవ్వకూడదు అని కోరుకో ఎందుకంటే అది గర్భవతి అయిన మరుక్షణం దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అప్పటివరకు ఎవర్ని కలవడానికి వీల్లేదు అందుకే ముందే అగ్రిమెంట్ పేపర్స్ మీద కూడా సంతకం పెట్టించుకున్నాను వెళ్లొస్తాను మామ !!! ” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య
సూర్య వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయారు భూపతి గారు
దేవుడా అసలు ఈ సూర్య ఏం మాట్లాడుతున్నాడు నా కూతురు నా కూతురు వీడితో ఉందా దానికి ఏం మాయ మాటలు చెప్పి వలలో వేసుకున్నాడో ఏంటో నాకు తెలియడం లేదు అసలు ఏంటిదంతా ఈ విషయం అక్షర కి ఎలా అయినా చేరవేయాలి లేదంటే అనర్ధాలు జరిగిపోతాయి లేదు నేను ఉన్నంతవరకు నా కూతురికి ఏం కానివ్వను సూర్య ఒక్కసారి నన్ను బయటికి రానివ్వు అప్పుడు చెప్తాను నీ పని నీ పతనం చూడనిదే నేను నిద్రపోను అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న అతని దగ్గరికి వచ్చారు కానిస్టేబుల్స్ ఇద్దరు
రండి అతను వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు మీరు మీ సెల్ లో ఉండాలి అంటూ అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్
లేదు ఎలా అయినా నేను బయటికి రావాలి బయటికి వచ్చాక సూర్య నిన్ను చంపకుండా ఆ దేవుడు కూడా నా నుంచి నిన్ను కాపాడలేడు గెట్ రెడీ ఫర్ దట్ అనుకుంటూ ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు భూపతి గారు
భూపతి గారికి గట్టి షాక్ ఇచ్చి అక్కడి నుంచి తిరిగి అక్షర దగ్గరికి స్టార్ట్ అయ్యాడు సూర్య
కొద్దిసేపటికి అక్షర ఉన్న భవంతి ముందు ఆగింది కార్
స్టైల్ గా కార్ దిగి లోపలికి అడుగులు వేశాడు
కింద డైనింగ్ టేబుల్ దగ్గర టేబుల్ క్లీన్ చేస్తూ కనిపించింది వంట మనిషి
తను ఉదయం టిఫిన్ తిన్నాదా సోఫాలో కూర్చుంటూ ప్రశ్నించాడు అతడు
ఆమె అతని వంక చూసి మళ్లీ తల దించేసుకొని ఆ కొంచెం తిన్నారు బాబు చెప్పింది ఆ అమ్మాయి
మధ్యాహ్నం వంటకి ఏం చేసావ్ మరో ప్రశ్న అడిగాడు
అది నేను ఆ అమ్మాయి గారిని అడిగాను ఆవిడ మాంసం తినను అని చెప్పారు అందుకే ఆవిడ కోసం వేరుగా చేసి మీకోసం వేరుగా చేశాను బాబు
సరే ముందు నాకు వడ్డించు అంటూ సోఫాలో నుంచి లేచి డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళాడు
అక్షర తన రూమ్ లోనే ఉండి ఆలోచిస్తూ ఆలోచనల నుంచి బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంది
ఈరోజుకి అంటే మమ్మీకి ఏదో ఒకటి చెప్పాను కానీ ఇదే ప్రశ్న అమ్మ రేపు అడుగుతుంది అప్పుడు అమ్మకి ఏం సమాధానం చెప్పాలి అసలు ఏం జరుగుతుంది దేవుడా అనవసరంగా ఈ డీల్ కి ఒప్పుకున్నానా డాడీ ఇంకా బయటికి వచ్చే మార్గమే మొదలుపెట్టినట్టు అనిపించడం లేదు అతను
లేదు అక్షర నువ్వు ఇంకా ఇలా ఉంటే నీ పని అవ్వదు నువ్వు కచ్చితంగా ముందడుగు వేయాలి నువ్వు అతన్ని నిలదీయాలి అతను రాగానే ప్రశ్నించు నువ్వు నీ జీవితాన్ని అతనికి ఇచ్చావు అలాంటిది అతను మీ నాన్నని సేవ్ చేయకపోతే నువ్వు చేసిన ఇంత పని కూడా వృధా అయిపోతుంది ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకో అక్షర బి స్ట్రాంగ్ తనని తానే మోటివేట్ చేసుకుంటూ ఉంది
సరిగ్గా అదే సమయానికి ఆమె మొబైల్ రింగ్ అయింది
అది అన్నోన్ నెంబర్ కావడంతో లిఫ్ట్ చేసింది అక్షర
హలో వినిపించింది అటు నుంచి ఒక మగ స్వరం
హలో ఎవరు ప్రశ్నిస్తూ అడిగింది
అక్కి నేను శశాంక్ నీ అన్నాడు అతను
అయినా నీకు నా వాయిస్ కూడా గుర్తులేదా అక్కి అలకగా అడిగాడు
అయ్యో అలా ఏం లేదు శశాంక్ అన్నోన్ నెంబర్ కదా అందుకే ఎవరా అని అడిగాను అయినా ఎప్పుడూ ఫోన్ చేసే నెంబర్ లో నుంచి కాకుండా వేరే నెంబర్ లో నుంచి ఎందుకు చేశావు అనుమానంగా ప్రశ్నించింది
అది నా మొబైల్ పోయింది ఇది ఫ్రెండ్ మొబైల్ తన ఫోన్లోంచి చేస్తున్నాను చెప్పాడు అతను
అవునా సరే నువ్వు బెంగళూరు నుంచి ఎప్పుడు రిటర్న్ అవుతున్నావ్
నాకు ఇంకో టెన్ డేస్ పడుతుంది రా ఆల్రెడీ అంకుల్ని విడిపించడానికి లాయర్స్ తో మాట్లాడుతున్నాను కానీ ఏ లాయర్ కూడా అంకుల్ కేస్ టేకప్ చేయను అంటున్నారు
చెట్టు కింద ప్లీడర్ దగ్గర్నుంచి ఇండియాలోనే ది బెస్ట్ లాయర్ వరకు ఎవరు కూడా మన కేసుని టేకప్ చేయడం లేదు ఎంత అమౌంట్ ఆఫర్ చేస్తున్నానో తెలుసా అయినా లాభం లేకుండా పోయిందిరా అన్నాడు శశాంక్ బాధగా
నాకు తెలుసు శశాంక్ ఈ పని అవ్వదు అని అందుకే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను అనుకుంటూ బయటికి చూసింది సూర్య మెట్లు ఎక్కి వస్తూ కనిపించడంతో
అమ్మో మళ్లీ సూర్య గారు చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు అనుకుంటూ శశాంక్ నేను మల్లి కాల్ చేస్తాను వర్క్ లో ఉన్నాను అంటూ సున్నితంగా చెప్పేసి కాల్ కట్ చేసింది అక్షర
సరిగ్గా అక్షర కాల్ కట్ చేసే టైం కి రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు సూర్య
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
————–continues………
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
Swipe left/right or tap the sides to turn pages