బ్లడీ ఇష్క్ – 3
” నాకు కావాల్సింది నేను చెప్పాను నీకు కావాల్సింది నువ్వు చెప్పావు నీకు ఓకే అంటే నాకు కూడా ఓకే ఛాయిస్ ఇస్ యువర్స్ నాకు రేపు మార్నింగ్ కి చెప్పు !!! “
” ఒకవేళ చెప్పలేక పోతే ఆఫీస్ కి చీర కట్టుకొని రా దట్ ఇండికేట్స్ యు అగ్రి మై డీల్ నైట్ అంతా బాగా కూర్చుని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా బేబీ !!! ” అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను
వెళ్లిపోయాక అతని చైర్ వైపు కంప్యూటర్ డిస్క్ వైపు చూసింది
అందంగా ఇంగ్లీషులో ఐదు అక్షరాల SURYA అన్న పేరు కనిపిస్తూ ఉంటే ఏడుస్తూ అక్కడినుంచి వెను తిరిగి వెళ్ళిపోయింది
ఇంటికి వెళ్ళింది ఆరోజు ఏమి తినాలి అనిపించక తన రూమ్ లోకి వెళ్లిపోయింది
” ఏంటిది ఎవరిని హెల్ప్ అడిగితే వాళ్లే చేతులెత్తేస్తున్నారు ఇతను చేస్తాను అంటున్నాడు కానీ దానికి బదులుగా నన్ను కోరుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి నా జీవితం కోసం ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ నాన్నకి ఉరిశిక్ష పడుతుంది అది అమ్మ చెల్లి తట్టుకోలేరు ఏం చేయాలి ?? “
” అలానే మనసు చంపుకొని అతని దగ్గరికి వెళ్తే అమ్మో ఇదంతా అయ్యాక ఒక వేళ అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు సొసైటీలో తలెత్తుకొని తిరగగలరా ఏంటి స్వామి నాకు ఈ గతి పట్టించావు ?!! ” ఏడుస్తూనే రాత్రి మొత్తం గడిపేసింది
ఇక నెక్స్ట్ డే ఒక నిర్ధారణకి వచ్చి ” లేదు నా జీవితం ఏం అయిపోయినా పర్వాలేదు నాన్నకి ఉరిశిక్ష పడకూడదు నాన్నని ఎలాగైనా సేవ్ చేయాలి !!! ” అనుకొని తల స్నానం చేసి తన అమ్మ తనకోసం కొన్న ఒక చీర కట్టుకొని ఆఫీస్ కి రెడీ అయ్యి బయటకు వచ్చింది
” ఏంటే ఈరోజు చీర కట్టుకున్నావ్ ?? ” కూతురి వంక అనుమానంగా చూస్తూ ప్రశ్నించారు ఆవిడ
” అది … అది ఈరోజు ఆఫీస్ కి ఎత్నిక్ వేర్ లో రమ్మన్నారు ఆడవాళ్లు అందరూ చీరలు కట్టుకోవాలి మగవాళ్ళు పంచ లేదంటే పైజామా కట్టుకోవాలి !!! ” సునయాసంగా తల్లికి అబద్ధం చెప్పేసింది.
ఎందుకంటే ఇది తను ముందే ఊహించింది అమ్మా ఇలా అడిగితే ఇదే సమాధానం చెప్పాలి అని గది లోనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చింది అక్షర
” అమ్మ నేను ఈవెనింగ్ రావడం లేట్ అవ్వచ్చు నువ్వు కంగారు పడకు నువ్వు చెల్లి జాగ్రత్తగా ఉండండి నేను కొంచెం లేట్ అయినా వచ్చేస్తాను ఓకేనా ఒకవేళ అంతగా లేట్ అయితే దగ్గర్లోనే సరిత వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటాను సరేనా నువ్వేం కంగారు పడకు !!! ” అంటూ తల్లికి ధైర్యం చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది అక్షర
ఇక్కడ అక్షర ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన అప్పటి నుంచి రెండు కళ్ళు తనని వెంబడిస్తూనే ఉన్నాయి
చీరలో బయటికి వచ్చిన తనని చూసి శాడిస్టిక్ స్మైల్ సూర్య లో
” నాకు తెలుసే నువ్వు మీ బాబు కోసం ఏమైనా చేస్తావని ఇక నీ జీవితం నా చేతిలోనే అది వారం తో పోయేది కాదు జీవితాంతం !!! ” అనుకుంటూ సూర్య కూడా తిరిగి ఆఫీస్ కి వెళ్లిపోయాడు
ఆఫీస్ కి వెళ్ళగానే సూర్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది అక్షర
తన పని చేసుకుంటూనే ” కమ్ ఇన్ !!! ” అన్నాడు సూర్య
లోపలికి వెళ్ళింది
వచ్చిన అక్షరా వైపు చూసాడు
ఎంతసేపు చూస్తున్న చూస్తూనే ఉండిపోవాలి అనిపించే అందం తనది
” అయితే డీల్ ఓకే అన్నమాట గుడ్ !!! ” అన్నాడు సూర్య ఆటిట్యూడ్ స్మైల్ తో
” సర్ కానీ మా నాన్నగారికి ఉరిశిక్ష పడబోతుంది దాన్ని ఎలా అయినా ఆపాలి ప్లీజ్ సర్ !!! ” రిక్వెస్ట్ గా అడుగుతూ ఉంది అక్షర
” మీ నాన్నకి ప్రస్తుతానికి ఉరిశిక్ష పడకుండా నేను ఆపగలను కానీ పూర్తిగా అతను బయటికి రావాలి అంటే టైం పడుతుంది సో పదా మనం వెళ్దాం అసలే నిన్ను తీసుకొని చాలా దూరం వెళ్ళాలి అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను !!! ” అన్నాడు సూర్య
తలదించుకొని నిలబడింది అక్షర
అక్షర ప్రతి కదలిక ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు సూర్య
అక్షర ని తీసుకొని అక్కడి నుంచి ఊరి చివరన ఉన్న తన గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్ళాడు
ఇప్పటివరకు అక్కడికి ఎవ్వరు వెళ్ళలేదు మొదటిగా అక్షర నీ తీసుకొని అక్కడికి వెళ్ళాడు సూర్య
” ఇదే వారం రోజులు మనం ఉండే ఇల్లు !!! ” అన్నాడు సూర్య
ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అక్షర
” ఏంటి చూస్తూ ఉంటే నీకు ఈ డీల్ ఇష్టం లేనట్టు ఉంది అంత ఫోర్స్ ఫుల్ గా అయితే వద్దులే నువ్వు రిటర్న్ వెళ్ళిపో !!! ” ఆమె వంక చూస్తూనే చెప్పాడు అతను
సూర్య మాటలకి కంగారుగా అతని వైపు చూసింది
అతని కళ్ళల్లో ఎలాంటి భావం కనిపించడం లేదు
” లే … లేదు నాకు ఈ డీల్ ఇష్టమే నా ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చాను మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు !!! ” కన్నీళ్ళని పంటి బిగువన దాస్తూ చెప్పింది
” ఓకే దెన్ ఆ రూమ్ లోకి వెళ్ళు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకో !!! ” అంటూ తనని ఒక రూమ్ లోకి పంపించాడు
ఇలా జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ తన ఫోన్ చేతిలోకి తీసుకుంది
తన తల్లికి డయల్ చేసింది
ఒక్కరింగుకే ఫోన్ లిఫ్ట్ చేశారు ఆవిడ
” హలో అమ్మ !!! “
” ఏమే రాత్రంతా సరిత ఇంట్లో ఉంటాను అని చెప్పావు ఇంకా పొద్దున అయిపోయింది ఇప్పటికి వచ్చి ఇంకా రాకపోతే ఏమనుకోవాలి వస్తున్నావా రావట్లేదా ?? ” కోపం ప్రదర్శిస్తూ అడిగారు
ఎంతైనా తల్లి మనసు కదా ఇప్పటికే భర్త అరెస్ట్ అవడంతో 90 శాతం పరువు పోయింది ఇప్పుడు మళ్లీ కూతురు రాత్రి అంతా ఇంటికి రాకపోతే పరువు ఏమవుతుందో అన్న భయంతో కూతుర్ని గదుముతూ ఉన్నారు ఆవిడ
” అమ్మ ఇప్పట్లో నేను రాలేను అంటే డాడీని విడిపించడానికి డబ్బులు కావాలి కదా దానికోసమే మా సర్ నాకు ఒక ప్రాజెక్ట్ ఆఫర్ ఇచ్చారు అది వన్ వీక్ లోపు సబ్మిట్ చేస్తే అతను డాడీ నీ విడిపిస్తానని చెప్పారు అందుకే ఇక్కడే నేను సరిత చేసుకుంటాము !!! ” తల్లికి నిజం చెప్పలేక అబద్ధాన్ని చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది
” నిజం చెప్పు నువ్వేం తప్పుడు దారిలో వెళ్లడం లేదు కదా ??? ” భయంగా కూతుర్ని ప్రశ్నించారు ఆవిడ
తన కన్నీళ్ళని ఆపుకోలేక ఫోన్ మ్యూట్ లో పెట్టి తన చీర కొంగు ని నోటికి అడ్డంగా పెట్టుకుని కన్నీళ్ళని గుండెల్లోనే అణిచేస్తూ తిరిగి అన్మ్యూట్ చేసి
” లేదమ్మా నేను ఏమీ తప్పు దారిలో వెళ్లడం లేదు నిజంగా నిజం అమ్మ నువ్వు కంగారు పడతావని చెప్తున్నాను కానీ ఇప్పుడు మనకి డబ్బులు అవసరం కదా అందుకే వారం రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను అని మా బాస్ కి మాట ఇచ్చాను దానికి ప్రతిఫలంగా ఆయన నాన్నని ఎలా అయినా విడిపిస్తానని చెప్పారు !!! ” బదులిచ్చింది అక్షర
” నువ్వేం చేస్తున్నావో ఏంటో నాకేం తెలియట్లేదు అంతా ఆ దేవుడి మీదే భారం వేయడం తప్ప నా చేతుల్లో ఏం లేదు కానీ జాగ్రత్తగా ఉండు అది మాత్రమే నేను చెప్పగలను ఎవర్ని గుడ్డిగా నమ్మకు వాళ్ల అవసరాలు తీర్చుకొని దయ దక్షిణ్యాలు లేకుండా మనల్ని పూచిక పుల్లలా తీసి పక్కన పడేస్తారు కాస్త జాగ్రత్తగా మసులుకో !!! ” ఆవిడ చెప్పాల్సింది చెప్పి కాల్ కట్ చేసేసారు
వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి చూసింది తన తండ్రికి ఉరిశిక్ష రద్దయినట్టు ఎక్కడ ఏ న్యూస్ ఛానల్ లో కూడా లేదు ” అంటే సూర్య గారు నన్ను మోసం చేశారా ?? లేదు ఎలా అయినా ఆయన వచ్చిన వెంటనే అడగాలి !!! ” అనుకుంటూ ఆలోచిస్తూనే మధ్యాహ్నం వరకు టైం గడిపేసింది
ఇక్కడ ఆఫీస్ కి వచ్చిన సూర్య రెండు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే అవి రెండు హాఫ్ డే లో కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు
కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న సూర్య మొబైల్ రింగ్ అయింది స్క్రీన్ వైపు చూసిన అతని భ్రుకుటి ముడి పడింది
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
————–continues………
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
Swipe left/right or tap the sides to turn pages