అవునా సరే నేను తినిపిస్తానులే అని మీనాక్షికి తినిపిస్తూ తను కూడా తింటూ ఉన్నాడు విరాట్
ఒక భార్యగా తన భర్త తన కళ్ళముందే పరాయి ఆడపిల్లకి అలా అన్నం గోరుముద్దలు తినిపిస్తూ ఉండటం చూసిన వైదేహి కి ఒళ్లంతా కంపరంగా అనిపిస్తుంది విరాట్ మీద చెప్పలేనంత కోపం వస్తుంటే అన్నిటిని మౌనంగా భరిస్తూ ఓర్చుకుంటూ అక్కడే నిలబడి ఉంది
తినడం అయిపోయిన తర్వాత విరాట్ చేయి కడుక్కొని అక్కడి నుంచి పైకి వెళ్తూ వెళ్తూ ఆగి వైదేహి వైపు చూస్తూ నీకు 20 మినిట్స్ మాత్రమే టైమ్ ఇస్తున్నాను. ఫాస్ట్ గా నా టైమ్ అస్సలు వేస్ట్ చేయకుండా రావాలి అని చెప్పేసి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు