ఒక అరగంట వెతికి మన మాస్టర్ ని కనిపెట్టిన ఫ్రెండ్ పాప మేఘ రమ్మంటున్న విషయం చెప్తే ఎందుకు అని కొట్టినట్టే అడిగాడు.
వీడి కోపిష్టి మొఖానికి బెదిరిపోయి చేతులు పిసుకుంటూనే తెలియదు అని చెప్పింది.
పో.. వస్తున్న అని ఆ ఒక్క అక్షరం కూడా తూటా లా వదిలిన మాస్టర్ గారి యాంగ్రీ ఫేస్ కి దానితో తప్ప ఎవరితో మాట్లాడడు, పొరపాటున ఎదురుపడ్డా ఇలా కాల్చేస్తాడు.. అని తిట్టుకుంటూనే పారిపోయి వచ్చి మేఘ కి చెప్పడంతో పాటు బాబు కోపానికి వంద వంకలు కూడా పెట్టి పోయింది.