వెనక్కి తిరిగి మరోసారి మేఘ ను చూశాడు.
అతనికి ఆశ పడుతున్న ఒక ఆడపిల్ల మనసు కనిపించింది.
కానీ వాళ్ళకి ఆ పాటలోని అర్థం, ఎమోషన్స్, మేఘ పర్ఫామెన్స్ ఏది కనిపించడం లేదు.. మదమెక్కి కొట్టుకుంటున్న వాళ్లకి శరీరం మాత్రమే కనిపించింది.
ముగ్గురి మొఖాలు మరోసారి చూసి సైలెంట్ గా వెళ్లిపోయిన అర్జున్ వాళ్ళు ఆ ప్లేస్ దాటి వచ్చేవరకు వెయిట్ చేశాడు.
మరో అరగంటకి క్యాంటీన్ వైపుకు పోతున్న ముగ్గురి మీద కాపు కాసిన పులిలా దూకాడు.