New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 135

మాంగళ్య బంధం – 135

హ అత్తయ్య … పూజ చేద్దామని పూల కోసం వెళ్తున్నాను  అని ప్రతిమ కూడా నవ్వుతూనే చెప్పి త్వరగా వెళ్లి పూలు కోసుకొని ఇంట్లోకి వచ్చేసి తొందర తొందరగా దేవుని గదిలో దీపం పెట్టి బయటకు తులసి కోట దగ్గర కూడా పూజ పూర్తి చేసుకుని  అప్పటికే వంటింట్లోకి వెళ్లి ఉన్న యశోద గారి దగ్గరికి వెళ్లి నిలబడుతుంది..

 

తల్లితోపాటు బయట నుండి ఇంట్లోకి వస్తున్న ప్రణయ్ కూడా  ప్రతిమని చూసి  హ్మ్ ప్రతిమ అప్పుడే లేచేసిందా.. నేనింకా ఎండబడే వరకు లేవదనుకున్నాను..

 

ఈ అమ్మాయికి ఉదయాన్నే లేచే అలవాటు ఉందా.. లేదంటే అలవాటుగా పొరపాటుగా ఈరోజు ఉదయాన్నే లేచేసరికి ఫ్రెష్ ఏ బయటకు వచ్చిందా అని తనలో తను అనుకుంటు.. ఏదైతే ఏంట్లే ఉదయాన్నే లేచింది అందుకు సంతోషం పూజ  కోసం  పువ్వులకి వెళ్తున్నట్టు ఉంది ఇది ఇంకా గొప్ప విషయం అనుకుంటాడు..

 

వంటింట్లోకి వచ్చిన కోడలు వైపు చూసి చిన్న నవ్వు నవ్వి  పూజ పూర్తయిందా తల్లి అని అడిగారు యశోద గారు..

 

హా అత్తయ్య అయిపోయింది నేను మీకు సహాయం చేస్తాను.. ఏం టిఫిన్ చేద్దాము అని కాస్త హుషారుగా అడిగింది..

 

హహహ టిఫిన్ సంగతి తర్వాత కానీ ముందు నువ్వు వచ్చి ఇలా కూర్చో.. టీ తాగుతావా కాఫీ తాగుతావా ఏం కావాలి నీకు అని అడిగారు ఆవిడ పొయ్యి వెలిగిస్తూ..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue