మృత్యు వనం – 1
వర్షాకాలం మొదలైన కొత్తలో ఆకాశం మేఘాలతో నిండిపోయి ఉంది. చల్లని గాలి వీచుతూ, చెట్ల ఆకులు మెల్లగా ఊగుతున్నాయి.
హైవే బస్ స్టాప్ దగ్గర నిల్చుని ఉంది ఒక అమ్మాయ్ ఫోన్ చూస్తూ. అప్పుడే భూ….. అంటూ వెనక నుండి అరుపు వినిపించగానే ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నవ్వుతూ
” ఎంటి బయపడ్డావ ” అన్నాడు అతను.
” సాయి నిన్ను ” అంటూ కొట్టడానికి వెళ్ళి అతని వెనకే ఉన్న ఇంకొక అతన్ని చూసి ” ప్రవీణ్ ఇద్దరు కలిసే వచ్చారా తోడు దొంగలు ” అంది.
ప్రవీణ్ నవ్వుతూ ” అవును సంధ్య ” అన్నాడు, వెంటనే సాయి ” ఎంటి మనమెనా వచ్చింది. హీరో, హీరోయిన్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదా ” అన్నాడు.
అలా అనగానే రెండు సెకండ్స్ లో వాళ్ళ ముందు ఒక కార్ వచ్చి ఆగింది. అందులో నుండి వైట్ షర్ట్, బ్లాక్ జీన్స్, బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని సెట్ చేసిన హెయిర్ తో దిగాడు.
” రా… రా గౌతమ్. నీకోసమే వెయిటింగ్ ఇక్కడ ” అన్నాడు ప్రవీణ్.
” లేట్ అయ్యాన ” అంటూ చుట్టూ చూసాడు. సాయి వెంటనే
” ఎవరిని వెతుకుతున్నారు సార్ గారు. కానీ మేడం గారు ఇంకా రాలేదు ” అన్నాడు నవ్వుతూ.
గౌతమ్ వెంటనే సియస్ గా చూస్తూ ” నేను అడిగాన. నోరు మూసుకుని ఉండు ” అనగానే
” ఈ కోపం అంతా మా దగ్గర చూపించాల్సిందే. అక్కడ మేడం ఎంట్రీ ఇవ్వగానే సార్ గారు సైలెంట్ మూడ్ లోకి వెళ్ళిపోతారు ” అని సాయి అనగానే ప్రవీణ్
” చాల్లే ఆపరా. ఎప్పుడు వాడిని అంటూ ఉంటావు. అయినా నువ్వు కూడా ఎంటి గౌతమ్. కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ప్రేమిస్తున్నావు. ఇప్పుడు అందరం జాబ్స్ కూడా చేస్తున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటావు ” అన్నాడు.
” ఎక్కడ నో చెప్తుంది అని నా భయం రా. తనని చూస్తేనే భయంగా ఉంటుంది. ఎప్పుడు సైలెంట్ గా, అవసరానికి మించి మాట్లాడకుండా, స్ట్రిక్ట్ గా ఉంటుంది కదా అందుకే. కానీ ఈ ట్రిప్ అయ్యే లోపు చెప్పేస్తా ”
” అది చూస్తాం లే ” అని సాయి అంటూ సంధ్య దగ్గరకి వెళ్లి ” ఎంటే ఈ రోజు సైలెంట్ గ ఉన్నావు ” అని అడిగాడు.
” అదేం లేదు రా. క్లైమేట్ బాగుంది ఎంజాయ్ చేస్తున్నా. అయినా వేద ఎంటి ఇంకా రాలేదు ”
” ఏమో మేడం గారికి మూడ్ లేదు ఏమో. అసలే తనకి ఇష్టం లేకపోయినా ట్రిప్ కి రమ్మని బలవంతం చేశాం. అసలు వస్తుందో రాదో కూడా తెలీదు ” అన్నాడు సాయి.
” వస్తుంది లే రా ” అని ప్రవీణ్ అనగానే
” అవును కచ్చితంగా వస్తుంది. లేకపోతే ఈ ట్రిప్ ఏ క్యాన్సిల్ ” అన్నాడు గౌతమ్.
సంధ్య వెంటనే ” అదేంటి గౌతమ్ అలా అంటావు. తను ఒక్కదాని కోసం మమ్మల్ని అందరినీ డిస్సపాయింట్ చేస్తావా ” అంది.
” తను లేకపోతే నాకు ఉండాలి అనిపించదు. మీరు ఎంజాయ్ చేయండి ” అనగానే సాయి
” అమ్మా వేదమ్మా. త్వరగా కరుణించి రావమ్మా. లేకపోతే కలవక కలవక కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తే ఎదవ నీకోసం డ్రాప్ అవుతున్నాడు ” అన్నాడు పైకి చూస్తు దేవుడికి దణ్ణం పెట్టుకుంటు.
” కాసేపు వెయిట్ చేద్దాం ” అని ప్రవీణ్ అనగానే అందరూ అక్కడే బెంచేస్ పై కూర్చుని కబుర్లలో పడ్డారు.
సంధ్య, వేద, గౌతం, ప్రవీణ్, సాయి…. కాలేజ్ రోజుల నుంచి ఒకే గ్యాంగ్. చదువు అయిపోయాక అందరూ ఉద్యోగాల్లో బిజీ అయిపోయినా, ఈసారి అందరూ కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు.
వర్షా కాలం స్టార్ట్ కావడంతో ట్రెక్కింగ్ లా కొండల దగ్గర ప్లాన్ చేయడంతో, సంధ్య ఒక మంచి ప్లేస్ సజ్జేస్ట్ చేయడంతో అందరూ ఒప్పుకున్నారు. గౌతమ్ బాబు కొంచెం లగ్జరీ కావడంతో తానే అన్ని చూసుకుని, ప్లేస్ కూడా ముందే ఒకసారి విసిట్ చేసి, అక్కడ ఆల్రెడీ ఒక గెస్ట్ హౌస్ మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాడు ఇబ్బంది రాకుండా.
సెకన్లు నిమిషాలు అవుతున్నాయి. నిమిషాలు కాస్త గంట అయింది. కానీ వేద ఇంకా రాలేదు. చూసి చూసి విసుగు వచ్చి సంధ్య వెంటనే పైకి లేచి ” గాయ్స్ మనం వెళ్దామా. తను వచ్చేలా లేదు ” అంది.
” ఇంకా కాసేపు చూద్దాం ” అన్నాడు గౌతమ్. తన మాట కాదు అనలేక కూర్చున్నారు అందరూ.
ఒక అర్ధగంటకి ఒక టాక్సీ వచ్చి ఆగింది వాళ్ళ ముందు. అందులో నుండి దిగింది వేద.
తనని చూడగానే గౌతమ్ కళ్ళు ఆనందంతో మెరిసాయి. సాయి మళ్ళి ప్రవీణ్, సంధ్య చేవి దగ్గరకి వెళ్లి ” చూసారా రాగానే ప్రపంచాన్నే మర్చిపోయి ఎలా చూస్తున్నాడో. ఎదో ఇప్పుడే మొదటి సారి చూస్తున్నట్టు ” అన్నాడు.
” వినపడుతుంది ” అన్నాడు గౌతమ్ ఓరగా వాళ్ళ వైపు చూసి. అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ వుండగానే అక్కడికి వచ్చింది వేద.
” సారి ఈ రోజు మంచి రోజు అంటే గుడికి వెళ్లి వస్తున్నా. అందుకే లేట్ అయ్యింది ” అంది.
” పర్లేదు వేద. మరి లేట్ ఎం కాలేదు లే. మేమే త్వరగా వచ్చి ఇక్కడ కూర్చున్నాం ” అని గౌతమ్ అనగానే ముగ్గురు వెనక నుండి గుర్రున చూసారు.
వాళ్ళ చూపులకి దిక్కులు చూస్తూ ” వెళ్దామా ” అన్నాడు.
” హ్మ్మ్ వెళ్దాం. అంతకంటే ముందు ” అంటూ తన బ్యాగ్ నుండి నాలుగు రక్షలు తీసి సాయి, ప్రవీణ్ కి ఇచ్చి
” గుడిలో పంతులు గారు ఇచ్చారు. అమ్మవారి దగ్గర పెట్టీ పూజ చేశారు అంట. కట్టుకోండి ” అంటూ ఇచ్చింది.
ఇద్దరు తీసుకుని కట్టుకున్నారు. సంధ్య దగ్గరకు వెళ్లి
” సంధ్య చెయ్యి చాపు నేను కడుతా ” అంది.
అయినా తను చెయ్యి చాపకుండా ” నాకు ఇవన్నీ నమ్మకం లేదు అని తెలుసు కదా ” అంది.
” అవును కానీ మంచిది కదా. ఒక్కసారికి ఎం అవుతుంది చెప్పు. రా కడుతా ” అంటూ దగ్గరకి వెళ్ళింది వేద.
వెంటనే సంధ్య దూరం జరిగి ” చెప్తే విను వేద. ఎవరి కోసమో నేను మారను. నాకు ఇవన్నీ నచ్చవు ” అంది.
ప్రవీణ్ మధ్యలో వచ్చి ” వదిలేయి వేద. తన గురించి తెలిసిందే కదా ” అన్నాడు.
తను ఎటువంటి భావం లేకుండా వెనక్కి వచ్చి గౌతమ్ చెయ్యి పట్టుకుంది. అలా తను చెయ్యి పట్టుకోగానే హార్ట్ బీట్ పెరిగిపోయింది గౌతమ్ కి.
గౌతమ్ కి కూడా రక్ష కట్టి, ఇంకోటి గౌతమ్ చేతిలో పెట్టీ
” నాకు కట్టు ” అంది.
మనసులోనే సంతోష పడిపోతూ తీసుకున్నాడు. వేద చెయ్యి ముందుకు చాపగానే కట్టడం మొదలు పెట్టాడు.
సాయి వెంటనే మళ్ళీ ” చూసావా రా ఎదో తాలి కట్టు అన్నట్టు ఎంత ఫీల్ అయిపోతున్నాడో. వీడిని ఈ జన్మలో మార్చలేం ” అన్నాడు.
సంధ్య నవ్వుతు ” నిజంగానే వాడు తాళిలా ఫీల్ అవుతున్నాడు ఏమో. మూడు సార్లు ముడి వేస్తున్నాడు ” అనగానే ముగ్గురు వాళ్ళ వైపు చూసారు. నిజంగానే మూడు సార్లు ముడి వేసి దాని వైపు చూస్తూ నిల్చున్నాడు వేద చెయ్యి పట్టుకుని.
సాయి అహు… ఆహు… అని దగ్గుతూ ముందుకు రాగానే వేద చెయ్యి వదిలేసి వెళ్దామా అన్నాడు.
” హ్మ్మ్… హ్మ్మ్… వెళ్దాం ” అనగానే అందరూ కార్లో ఎక్కారు.
సంధ్య ముందు సీట్ లో కూర్చుంది ముందే. గౌతమ్ కీస్ ప్రవీణ్ చేతికి క్యాచ్ వేసి ” నువ్వు డ్రైవ్ చేయరా ” అంటూ వెనక కూర్చున్నాడు. ఒక వైపు వేద ఇంకో వైపు సాయి, మధ్యలో గౌతమ్ కుర్చుగానే కార్ స్టార్ట్ అయ్యింది.
వేద మౌనంగా బయటకి చూస్తుంది. గౌతమ్ బాబు వేధను చూస్తూ కూర్చున్నాడు. పక్కన ఉన్న సాయి కి మాత్రం ఒళ్ళు మండుతుంది గౌతమ్ నీ చూస్తుంటే.
” అలా చూసే బదులు తినెయ్ రా. ఎదవ సచ్చినోడ ” అంటూ నసిగాడు.
గౌతమ్ సీరియస్ గా ఒక లుక్ ఇవ్వగానే ” వీటికెం తక్కువ లేదు ” అనుకుంటూ కాలేజ్ విషయాలు మాట్లాడ్డం మొదలు పెట్టారు.
అలా వారి ప్రయాణం మధ్యాహ్నం మొదలు పెట్టడంతో ఏమైనా కొంచెం తిని బయలుదేరుదాం అనుకుని అక్కడే ఒక హోటల్ లో తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యారు.
అలా కాలేజ్ విషయాలు జాబ్ విషయాలు మాట్లాడుకుంటూ ” వేద నువ్వు అర్కియలజిస్ట్ కదా ” అని అడిగాడు ప్రవీణ్.
” హ్మ్మ్ ” అని ఊరుకుంది.
” సంధ్య నీ డాక్టర్ జాబ్ ఎలా ఉంది ” అనగానే
” బాగుంది. ఇంతకీ మీ ఇద్దరు తోడు దొంగలు ఎం చేస్తున్నారు ” అనగానే
” బిజినెస్ పెట్టాలి అని ట్రై చేస్తున్నాం ” అన్నాడు సాయి.
” ఎందుకు దివాలా తీసి పోవడానిక ” అని గౌతమ్ అనగానే
” నీకేంటి నాయన తండ్రి తరువాత నువ్వే కాబోయే సియిఓ. మాకు అలా లేదు గా ” అన్నాడు సాయి.
” ఈ నోరు తగ్గించుకుంటే బాగు పడుతావు రా నువ్వు ” అని గౌతమ్ అనగానే
” నువ్వు ఆ నోరు కొంచెం వాడాల్సిన చోట వాడితే బాగుపడుతావు గౌతమ్ ” అన్నాడు భుజం పై చేయ్యేస్తు.
” నీతో మాట్లాడ్డం నా బుద్ధి తక్కువ. చెయ్యి తీ బే ” అంటూ మళ్ళీ వేద ను చూసే పనిలో పడిపోయాడు. అందరూ నవ్వి ఊరుకున్నారు.
అలా చాలా సేపటి వరకు ఎవరు మాట్లాడక పోవడంతో విసుగు వచ్చిన సాయి ” ఇలా సైలెంట్ గా ఉంటే నాకు ఎం తోచదు. ఏమైనా చెప్పండి రా ” అన్నాడు.
” నీలా వాగే ఓపిక మాకు లేదు ” అని గౌతమ్ అనగానే
” నువ్వు నీ పని చూసుకో ” అంటూ గుడ్లు ఉరిమి చూసాడు. అయినా గౌతమ్ పట్టించుకోకుండా వేదానందం పొందుతున్నాడు.
” సరే అయితే మీ జీవితాల్లో జరిగిన ఎదైనా హార్రర్ ఇన్సిడెంట్ ఉంటే చెప్పండి టైం పాస్ అవుతుంది ” అన్నాడు.
అలా అనగానే సంధ్య మొహం ఒక్కసారిగా మారిపోయింది. ఏవో చిత్రాలు అలా వచ్చి పోతున్నాయి తన కళ్ళ ముందు.
అది గమనించిన ప్రవీణ్ ” సంధ్య ఏమైంది. నీకు అలాంటిది ఏమైనా ఎదురయ్యిందా ” అని అడిగాడు.
తను నిట్టూర్చి ” జరిగింది ” అంటూ చెప్పడం మొదలు పెట్టింది.
@@@@@@@@@@@@@@@@@@@@@@@
To be continued………
Swipe left/right or tap the sides to turn pages