మృత్యు వనం – 2
సంధ్య కాసేపు కిటికీ బయటకి చూస్తూ నిట్టూర్చింది.
“ఇది కరెక్ట్ గా నెల క్రితం జరిగిన విషయం…”
అని చెప్పగానే కారులో ఉన్న వాళ్ళందరూ ఆమె వైపు చూశారు.
” ఒక రోజు నైట్ డ్యూటీ పడింది. ఆ రోజు వర్షం కూడా పడుతోంది.” అని మొదలు పెట్టింది.
కారు లోపల నిశ్శబ్దం అలుముకుంది.
ఎమర్జెన్సీ కేసులు ఎక్కువగా రావడంతో తెల్లవారుజాము వరకు పని చేశాం. డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్లబోతుంటే మా సీనియర్ డాక్టర్ వచ్చి
‘సంధ్య… మార్చురీలో ఉన్న ఒక బాడీ రిపోర్ట్ చెక్ చేసి వెళ్లు’ అని చెప్పారు. నాకు అప్పటికే నిద్ర వస్తోంది. కానీ సరే అని వెళ్లాను.
అది బేస్మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి -1 అని నొక్కాను. లిఫ్ట్ నేరుగా కిందకి వెళ్ళింది.
మార్చురీ అంటే అప్పటివరకు నాకు పెద్దగా భయం లేదు. రోజూ డెడ్ బాడీస్ చూసేదాన్ని. కానీ ఆ రోజు…
సంధ్య గొంతు కొంచెం వణికింది. లోపలికి వెళ్లగానే ఏదో వింతగా అనిపించింది.
“ఏంటి?” అని సాయి ఆసక్తిగా అడిగాడు.
” చాలా చల్లగా ఉంది. ఏసీ ఆన్ లేకపోయినా ”
” అది నీ భ్రమ అయ్యుంటుంది ” అన్నాడు ప్రవీణ్. సంధ్య అవును అన్నట్టు తల ఊపింది.
మొదట నేనూ అలాగే అనుకున్నా, అక్కడ ఒక అమ్మాయి బాడీ ఉంది. వయసు ఇరవై ఐదు ఉంటుందేమో యాక్సిడెంట్ కేస్.
చాలా దారుణంగా చనిపోయింది. తన బాడీని చూసి ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయ్యింది. మొహం నిండా గాట్లు ఉన్నాయి, ఎవరో గోర్లతో రక్కినట్టు. కళ్ళు లేకుండా, వాటి స్థానంలో రెండు గుంతలు ఉన్నాయి నల్లగా. ఆమె తలలో మెదడు లేదు. ఎవరో పగలకొట్టి తీసినట్టు. అలాగే కడుపు రెండుగా చీల్చి పేగులు, అవయవాలు అన్ని బయటకి తీసినట్టు ఉంది.
ఇదంతా బ్రతికి ఉండగా జరిగింది అని రిపోర్ట్ లో ఉంది అనగానే కార్లో అందరూ భయంతో ” ఎంటి బ్రతికి ఉండగా జరిగిందా ” అన్నారు.
సంధ్య హ్మ్మ్ అంటూ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది .
ఆమె బాడీని మార్చురీకి షిఫ్ట్ చేశారు. సంధ్య కళ్ళలో ఏదో విచిత్రమైన మెరుపు కనిపించింది.
ఆ రోజు అర్థరాత్రి నేను ఒక్కదాన్నే మార్చురీలో ఉన్నాను. నేను రిపోర్ట్ చెక్ చేస్తుంటే టక్… టక్… అంటూ ఎవరో తలుపు కొట్టినట్టు వినిపించింది. వెనక్కి తిరిగి చూసా. ఎవరూ లేరు.
మళ్లీ పని చేయడం మొదలుపెట్టా.
రెండు నిమిషాల తర్వాత…
టక్… టక్… టక్…
ఈసారి శబ్దం ఫ్రీజర్ లోపల నుంచి వచ్చింది.
సాయి వెంటనే, ” నేను అయితే అప్పుడే పారిపోయేవాడిని ” అనగానే అందరూ నవ్వారు.
కానీ సంధ్య మాత్రం నవ్వలేదు. ” నేను కూడా అదే చేయాల్సింది ” అంది.
ఆ మాటతో అందరి నవ్వులు ఆగిపోయాయి.
” నెమ్మదిగా ఫ్రీజర్ దగ్గరకు వెళ్లాను. శబ్దం ఆగిపోయింది. తలుపు తెరిచాను. లోపల అదే అమ్మాయి బాడీ ఉంది. వేరే ఎమీ లేదు కానీ… ఆమె చేతి పొజిషన్ మారిపోయింది.
గౌతమ్ కనుబొమ్మలు ముడిచాడు “అంటే?” అని అడిగాడు.
నేను మొదట చూసినప్పుడు చేతులు ఛాతీ మీద ఉన్నాయి. ఇప్పుడు పక్కకి జారిపోయాయి. మొదట నేను తప్పుగా గుర్తు పెట్టుకున్నానేమో అనుకున్నా. ఫ్రీజర్ మూసేసి వెనక్కి తిరిగాను.
అప్పుడే…
సంధ్య కళ్ళు మూసుకుంది. నా వెనకాల ఎవరో నిలబడి ఊపిరి తీసుకుంటున్న శబ్దం వినిపించింది. చాలా దగ్గరగా, ఆ వేడి శ్వాస నాకు తగులుతున్నట్టు అనిపించింది గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.
కారులో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది.
నేమ్మదిగా వెనక్కి తిరిగి చూసా. అక్కడ ఎవరూ లేరు. కొంచెం ఊపిరి తీసుకుని నార్మల్ అయ్యే లోపు ఫ్రీజర్ తలుపు తెరుచుకుంది. అందులో ఉన్న ఆ అమ్మాయి…
సంధ్య గొంతు బిగుసుకుంది.
“కళ్ళు తెరిచి నన్నే చూస్తోంది. నేను భ్రమ పడుతున్నా అనుకున్నా. కానీ ఆమె కళ్ళు నిజంగానే తెరిచి ఉన్నాయి.
మరుసటి క్షణం…
ఆమె పెదవులు కదిలాయి. ” నన్ను ఒంటరిగా వదిలేయొద్దు… ” అని చెప్పింది.
భయంతో నేను అలాగే బిగుసుకు పోయా. అప్పుడే మళ్ళి
తను లేచి కూర్చుంది అనగానే
కారులో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది.
” ఆమె నన్ను చూసి…నువ్వు కూడా మాతో రావాలి… “
అని చెప్పింది.
నాకు భయం వేసి వెంటనే అక్కడి నుండి బయటకి పరిగెత్తాను. బయటకి వెళ్లి లిఫ్ట్ వైపు పరుగు దిసాను. అప్పుడే నా వెనక అడుగులు చప్పుడు వినిపించింది.
వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేక లిఫ్ట్ దగ్గరకి వెళ్లి ఓపెన్ చేశాను. కానీ అది పని చేయలేదు. అంతకంతకూ ఆ అడుగుల చప్పుడు దగ్గర అవుతున్న కొద్దీ నాకు భయంతో చెమటలు పడుతున్నాయి.
వెంటనే అక్కడ నుండి లిఫ్ట్ పక్కన ఉన్న చిన్న సందులో వెళ్లి దాక్కున్నా. ఆ అడుగుల చప్పుడు చాలా దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. లోపల భయం ఉన్నా, అదేంటో తెలుసుకోవాలి అనే కోరిక నా మనసుని ప్రేరేపిస్తుంటే మెల్లగా తొంగి చూసా లిఫ్ట్ వైపు కళ్ళు మాత్రమే బయట పెట్టి.
అక్కడ చూసిన దృశ్యం తలుచుకుంటే ఇప్పటికీ నా గుండె ఆగిపోతుంది.
@@@@@@@@@@@@@@@@@@@@@@
To be continued……
కామెంట్స్ ప్లీజ్😊😊
Swipe left/right or tap the sides to turn pages