అన్విక తన తండ్రి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది. అప్పుడే ఆమె ఫోన్ కి ఒక ప్రైవేట్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. నీ తండ్రి గౌరవంగా బతకాలన్నా, మీ ఇల్లు మీకు ఉండాలన్నా..
నీ తండ్రి గౌరవంగా బతకాలన్నా, మీ ఇల్లు మీకు ఉండాలన్నా.. వెంటనే సిటీ బయట ఉన్న సామ్రాట్ ఫామ్ హౌస్ కి రా – రణ్వీర్
అన్వికకు ఒక్కసారిగా ఒళ్లు మండింది. ఇదంతా రణ్వీర్ చేస్తున్నాడని ఆమెకు అప్పుడే అర్థమైంది. వెంటనే ఆమె క్యాబ్ బుక్ చేసుకుని ఫామ్ హౌస్ కి చేరుకుంది.
అక్కడ రణ్వీర్ ఒక లగ్జరీ కుర్చీలో కూర్చుని సిగార్ తాగుతూ, టేబుల్ మీద ఉన్న శ్రీనివాస్ గారి అరెస్ట్ వారెంట్ చూస్తున్నాడు.
రణ్వీర్ గారు ఏంటిది? మీరు ఇంత నీచానికి దిగజారుతారని నేను అనుకోలేదు. నా తండ్రి ఏం తప్పు చేశారని ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అని అన్విక అరిచింది.
రణ్వీర్ నెమ్మదిగా లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. అతని కళ్లలో ఆ పాత ప్రేమ లేదు, కేవలం ఒక ఆధిపత్యం కనిపిస్తోంది.