మొత్తం హాల్ అంతా చప్పట్లు, పూల వర్షంతో నిండిపోయింది. రణ్వీర్ అన్విక చెవి దగ్గరకు వంగి, ఈ రోజు నుంచి నువ్వు అధికారికంగా నా దాన్నివి అన్వికా..
నిన్ను ఈ ప్రపంచం నుంచి నేను దాచి ఉంచుతాను అని రహస్యంగా అన్నాడు.,……..
నిశ్చితార్థ వేడుక కళ్యాణ మండపంలో వైభవంగా సాగుతోంది.
అన్విక, రణ్వీర్ స్టేజ్ మీద కూర్చుని ఉండగా, ఒక్కసారిగా అతిథుల మధ్యలో సందడి మొదలైంది.
ఒక ఎత్తైన వ్యక్తి, రాయల్ లుక్ తో, స్టైలిష్ గా నడుచుకుంటూ స్టేజ్ వైపు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అతనే రఘు. రణ్వీర్ కి చిన్నప్పటి నుంచి అత్యంత ఆప్తమిత్రుడు. స్టేట్స్ లో సెటిల్ అయినా, రణ్వీర్ కి సంబంధించిన ప్రతి విషయం రఘుకి తెలుసు.