ఎంత ఆలోచించినా అతనికి ధన్విక ఎందుకు అతన్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందో అర్ధం కావడం లేదు…అలా ఆలోచిస్తూ రెండు గంటల సేపు షవర్ కింద తడుస్తూనే ఉంటాడు…
అంతలో అతని రూం డోర్ ఎవరో గట్టిగా కొట్టిన సౌండ్ వినిపిస్తూ ఉండే సరికి షవర్ ఆఫ్ చేసి టవల్ చుట్టుకొని బెడ్ రూం లోకి వెళ్ళాడు..
అలాగే వెళ్లి డోర్ ఓపెన్ చేసే సరికి ఎదురుగా మున్నా కనిపిస్తాడు…మున్నా నీ అక్కడ చూసిన దృవ్ నువ్వు ఎంటి ఇక్కడ ఈ టైం లో అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు…