రాక్షస ప్రేమ -41
“నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా వాళ్లు తీర్థయాత్రలకు వెళ్లారు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయారు అని అంటావేంటి పిచ్చిగాని పట్టిందా..?” అని అసహనంగా అన్నాడు కార్తికేయ.
“పిచ్చి నాకు కాదు ఇదిగో మీ కొడుకు రాసిన ఈ లెటర్ చదివిన తర్వాత మీకు పడుతుంది పిచ్చి” అంటూ తన చేతిలో ఉన్న పేపర్ ని తన భర్త ముందుకు జరిపి కోపం గా అన్నది కనకధారా.
“ఏంటి నీ గోల” అని ఆమె చేతిలో ఉన్న లెటర్ తీసుకున్నాడు కార్తికేయ.
“గోల నాది కాదు ఈ లెటర్ చదివిన తర్వాత మీరు చేస్తారు గోల. మన ఇంటి పరువంతా తీసేసింది ఆ పిల్ల. అప్పటికి నేను వద్దు అని చెప్తూనే ఉన్నాను కానీ మీరు వినలేదు వాడు ప్రేమించాడు అమ్మాయి మంచిదే అని పెళ్లికి ఒకే చెప్పారు. అంతకుమించి అత్తయ్య కూడా ఈ పెళ్లికి ఒకే చెప్పేసి మధ్యలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిన వెంటనే పెళ్లి ఆపేస్తాను అని చెప్పింది.