42
“లేదు బావగారు నాకు కూడా ఫోన్ చేయలేదు వాళ్లు బిజీగా ఉన్నారు ఏమో డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మేం కూడా ఫోన్ చేయడం లేదు. సరే నేను మరల ఫోన్ చేస్తాను” అని ఫోన్ కట్ చేసి ఫోన్ వైపే చూస్తూ ఉన్నారు కార్తికేయ.
వాళ్లకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎవరికీ చెప్పకుండా ఎవరికీ తెలియకుండా అంత సీక్రెట్ గా వీళ్ళు ఎందుకు వెళ్లిపోయారు అని ఆలోచనలో పడిపోయారు కార్తికేయ.
సాయంత్రం 6 గంటల టైం లో తను కంపెనీ సీఈఓ జాయిన్ అయిన మూడు రోజులకే ఒక కొత్త ప్రాజెక్ట్ సైన్ చేశాను ఇది నా సక్సెస్ కి మొదటి అడుగు అని హ్యాపీగా ఇంటికి వచ్చిన రౌద్రా కి ఇంటిలో సిచువేషన్ డిఫరెంట్గా అనిపించడంతో ఏమైంది నానమ్మ అంటూ తన నానమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకుని బ్యాగ్ ని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి అడిగాడు రౌద్ర.
ఏం అవటమేంటి అని కనకమహాలక్ష్మి విరాట్ విరజిత ఇద్దరూ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు అని చెప్పాలి అని నోరు తెరిచేలోపే కనకధారా “ఏముంది నీ వదిన లేచిపోయింది” అని అన్నది.
వాట్ అని ఒక్కసారిగా లేచి కూర్చొని తన తల్లి వైపు చూసాడు రౌద్ర.