-43
“నేను నీకు భర్తగా ఓకేనా కాదా..? నా మీద నీకు నమ్మకం ఉందా..?” అని మరొకసారి అడిగాడు రౌద్ర.
“అయ్యో రుద్ర నువ్వు ఎందుకు ఇలా ఒకే క్వశ్చన్ ని ఇన్నిసార్లు రిపీట్ చేసి అడుగుతున్నావు. అయినా నీ మీద నాకు ఉన్న నమ్మకం గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్.. నువ్వు నా భర్త అని నేను ఊహించుకోకపోతే, ఇంత ఉదయాన్నే నువ్వు ఫోన్ చేసి నాతో పాటు రా అంటే నేను నీతో పాటు ఎందుకు వస్తాను. నీ మీద నమ్మకం ఉంటేనే కదా వస్తున్నాను,
ఆ విషయం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు కానీ ఇలా సడన్గా ఇలా పెళ్లి చేసుకోవడం మాత్రం..” అని ఏం మాట్లాడాలో అర్థం కాక అసహనంగా ఫేస్ పెట్టి పక్కకు తిప్పింది.
అప్పుడే లోపల శివునికి అభిషేకం చేసి బయటికి వచ్చిన పూజారి గారు వాళ్ళిద్దరినీ చూసి “రౌద్ర ఇంత ఉదయాన్నే ఇలా గుడికి వచ్చావ్ ఏంటి ఏదైనా పని ఉందా..?” అని అడిగారు.
“పంతులుగారు తను నా భార్య, ఇప్పుడే మా పెళ్లి జరిగింది. ఆశీర్వదించండి” అనే శౌర్య చేతిని పట్టుకొని పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి కిందకు వంగాడు.
శౌర్య ఇక ఏమి చేయలేక, అంతకుమించి రౌద్ర మీద తనకి ఉన్న ప్రేమతో, తన మెడలో రౌద్ర కట్టిన తాళిని కాదు అనలేక ఎప్పటినుంచో అతనిని భర్తగా మనసులో అనుకుంటూ జీవిస్తున్న ఆమె ఇప్పుడు ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేసి తను కూడా రౌద్రతో కలిసి పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది.