New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రొమాంటిక్ బీస్ట్ – 1

రొమాంటిక్ బీస్ట్ – 1

అర్ధ రాత్రి సమయం సుమారు 12:30 రోడ్డు మీద బిక్కు బిక్కు మంటూ భయంతో పరిగెడుతూ ఉంది ఒక అమ్మాయి
దేవుడా ఆ రాక్షసులకి నేను చిక్కకుండా నన్ను కాపాడు తండ్రి నీకు రేపు సోమవారం గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి లీటర్ పాల ప్యాకెట్ తో నీకు అభిషేకం సమర్పించుకుంటా అనుకుంటూ భయం భయంగా పరిగెడుతూ అనుకోకుండా ఎదురుగా వస్తున్న కారుకి తగిలి కింద పడిపోయింది ఆ అమ్మాయి 
తన కార్ కి గుద్దుకొని ఆ అమ్మాయి పడిపోగానే సెకండ్ లో కార్ ఆగిపోయింది 
కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి దిగాడు ఆరడుగుల ఆజానుబాహుడు 
చూడడానికి వైట్ గా ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్న అతని కళ్ళు మాత్రం చింత నిప్పులా ఉన్నాయి 
ముందుకి వచ్చి కింద పడ్డ అమ్మాయి వైపు చూసి రెండు క్షణాలు షాక్ అయ్యాడు 
మరుక్షణమే అమూల్య అంటూ అతను అరిచినా అరుపుకి ఆమెపై ప్రాణాలు పైనే పోయాయి 
దేవుడా రాక్షసుల నుంచి కాపాడమంటే ఏకంగా సైతాన్ కి అప్పజెప్పేసావా నీకు నేనంటే ఎందుకు తండ్రి ఇంత పగ అనుకుంటూ భయంగా లేచి నిలబడింది అమూల్య 
అప్పుడే అక్కడికి వచ్చారు ఒక ముగ్గురు పోకిరి  వెధవలు 
మా నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావా అది నీ వల్ల కాదు మర్యాదగా నువ్వు మాకు లొంగిపోతే నీకు పెయిన్ తెలియకుండా మా పని మేము చేసుకుంటాం లేదంటే నువ్వు అరిచే అరుపులతో మాలో కోరిక ఇంకా ఇంకా డబుల్ అయ్యేలా చేస్తాము అంటూ వల్గర్ గా మాట్లాడుతున్న వాళ్లు పక్కనే రౌద్రంగా నిలబడి ఉన్న వ్యక్తి వైపు కనీసం పట్టించుకోలేదు 
ఆ మాటలు విన్న అతని దవడలు బిగుసుకున్నాయి చేతి నరాలు పచ్చగా ఉబ్బి బయటకి స్పష్టంగా కనిపిస్తున్నాయి 
మొహం మొత్తం ఎర్రగా టమాటో రంగులోకి మారిపోయి కళ్ళు ఇందాకటి కంటే ఇంకా రౌద్రంగా కనిపిస్తున్నాయి 
ఆ ముగ్గురిలో నుంచి ఒకడు ముందుకి వచ్చి అమూల్య చెయ్యి పట్టుకునేంతలో తన పాకెట్ లో ఉన్న గన్ తీసి వాడి చేతి మీద షూట్ చేశాడు మన బీస్ట్ బాబు 
అమ్మ అంటూ అరుస్తూ అవతల వైపు చూశాడు వాడు 
వాడితో పాటే మిగతా ఇద్దరూ కూడా ఒక్కసారిగా అంత రౌద్రంగా ఉన్న మన రుద్ర బాబుని చూసేసరికి పైప్రాణాలు పైనే పోయాయి 
నీ యెబ్బ నీకు ఎంత ధైర్యం ఉంటే నా పిల్ల నీ టచ్ చెయ్యాలి అని చూస్తావు రా నా కొడక అంటూ తన చేతిలో ఉన్న గన్ అక్కడే కార్ మీద పెట్టి వాడి దగ్గరికి వెళ్లి బుల్లెట్ తగిలిన వాడి చేతి మీద కరెక్ట్ గా బుల్లెట్ తగిలిన చోటే గట్టిగా పట్టుకొని వెనక్కి మెలి తిప్పాడు రుద్ర 
వాడు పెట్టిన అరుపులకి మిగతా ఇద్దరికీ తాగింది మొత్తం దిగిపోయి అక్కడ నుంచి పరుగున పారిపోయారు వాళ్ళు 
అన్న అన్న తప్పైపోయింది అన్న వదిలేయండి అన్నాడు వాడు భయంతో నొప్పితో 
వదిలేయాలా ఎలా వదిలేస్తాను నువ్వు నా పిల్ల గురించి తప్పుగా మాట్లాడిన తర్వాత వదిలేస్తే నేను మాగాడినే కాదు రా అంటూ వాడి నాలుక పట్టుకొని బయటికి పీకి పక్కన పడేసి తన గన్ తీసుకొని వాడి గుండెల్లో నాలుగు బులెట్లు దింపేశాడు అదంతా చూసిన అమూల్య బిక్క చచ్చిపోయింది 
రుద్ర పక్కకి చూసేసరికి అక్కడ మిగతా ఇద్దరు పారిపోయి ఉండటంతో వెంటనే తన మొబైల్ తీసుకొని ఇక్కడ ఇంటికి వెళ్లే రూట్లో ఒకడు చచ్చి పడున్నాడు వాడితో పాటు వచ్చిన ఇంకొక ఇద్దరు పారిపోయారు రేపు ఉదయం నేను లేచేసరికి వాళ్లు మన అండర్ లో ఉన్నారు అన్న న్యూస్ నాకు తెలియాలి లేదంటే వాళ్లకి ఇవ్వాల్సిన చావు నీకు వస్తుంది అంటూ అవతల వ్యక్తికి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేసి అమూల్య వైపు చూసాడు 
అప్పటికే తన శరీరం మొత్తం చమటతో తడిచిపోయి దేహం నిలువెల్లా వనికి పోతుంది 
గెట్ ఇన్సైడ్ ద కార్ అన్న ఒక్క మాట అతని నుంచి రావడం ఆలస్యం మారు మాట్లాడకుండా వెళ్లి కార్ లో కూర్చుంది అమూల్య 
తను కూర్చోగానే రుద్ర కూడా కూర్చొని స్టార్ట్ చేశాడు 
అతని కోపం మొత్తాన్ని తన ఎదురుగా ఉన్న స్టీరింగ్ మీద చూపిస్తూ ఎలా పడితే అలా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు రుద్ర 
రుద్ర గారు ప్లీజ్ కార్ స్లో గా డ్రైవ్ చేయండి నాకు భయంగా ఉంది అంది అమూల్య భయంతో  
కానీ రుద్రా నుంచి ఎలాంటి సమాధానం లేదు దానికి బదులు కార్ స్పీడ్ ఇంకాస్త పెరిగింది 
దాని బట్టి అతను ఎంత కోపంగా ఉన్నాడో అర్థమవుతుంటే ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోయింది అమూల్య 
అరగంట పడే జర్నీని 10 నిమిషాల్లో కంప్లీట్ చేశాడు రుద్ర అంటే అంత ఫాస్ట్ గా డ్రైవ్ చేశాడన్నమాట 
కార్ డోర్ ఓపెన్ చేసి బయటకి వచ్చి అమూల్య కార్ డోర్ ఓపెన్ చేసి తన రెక్క పట్టుకొని బరాబరా లోపలికి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్లి హాల్ మధ్యలో పడేసాడు రుద్ర 
————-Continues………… 
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ 
ఇది మన కొత్త స్టోరీ బాబు లో చాలా అంటే చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది 😌😌😌