అప్పుడు తనకి అర్థమైంది బస్ ఛార్జి కి 150 రూపాయలు ఇచ్చింది రోజా,అంటే ఆ డబ్బులు తీసుకొని అక్కడ నుంచి వచ్చేసింది.
కానీ..! ఎందుకు వచ్చేసింది అనేది క్లారిటీ లేదు అనసూయకి.
వెంటనే తనకి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడ్రస్ చెప్పి ఆ ఇంట్లో రోజా అనే అమ్మాయి ఉండాలి ఏమైందో సీక్రెట్ గా కనుక్కోమని పనిపూరమాయిచింది.. అందుకు కొంత డబ్బు కూడా ఇస్తాను అని కూడా చెప్పింది.
వెంటనే అటువైపు వాళ్ళు అనసూయ ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి కదలారు.