“చూడాలి.. మనం పని వాళ్ళని మన వాళ్ళుగా చూస్తేనే రేపటి రోజున వాళ్ళు మనల్ని వాళ్ళ వాళ్ళలా చూస్తారు.. యద్భావం తద్భవతి అని అంటుంది అమ్మాయి గారు.” అని అన్నాడు కారుని వాళ్ళ ఇంటి వైపు పరుగులు పెట్టిస్తూ శేఖర్.
“అమ్మ వాళ్ళది చాలా రాయల్ ఫ్యామిలీ అనుకుంటా..! కానీ అమ్మ మాత్రం హంగులకి ఆర్భాటాలకి పోదనుకుంటా..! సింప్లిసిటీ మైంటైన్ చేస్తుందనుకుంటా..!” అని అంది తనకి పరిచయమైన ఆ పెద్దవిడ దగ్గర నుంచి అనసూయ శరత్ కుమార్ వరకు ఒక రిల్ వేసుకొని రోజా.
“అమ్మాయి గారిది బాగా సంపన్న కుటుంబం, మేనరికం పెళ్లి.. అటు ఉన్నవాళ్లే,ఇటు ఉన్నవాళ్లే.
వాళ్ళ అమ్మానాన్నకి అమ్మాయిగారు ఒక్కరే సంతానం,అమ్మాయి గారిని చేసుకున్న ఆయన కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కరే సంతానం.
బిజినెస్ లు ఉన్నాయి అమ్మాయి గారి భర్తకి, ఆయన కాలం చేశాక అవి అన్ని అమ్మాయిగారు చూసుకుంటున్నారు ఇటు ఇండియాలో అటు అమెరికాలో కూడా బిజినెస్ లు ఉన్నాయి..